ఇంట్లోకి అనుకోని అతిథి.. కట్‌చేస్తే ఊరంతా పరుగో పరుగు! వీడియో వైరల్

ఇంట్లోకి అనుకోని అతిథి.. కట్‌చేస్తే ఊరంతా పరుగో పరుగు! వీడియో వైరల్


ఇంట్లోకి అనుకోని అతిథి.. కట్‌చేస్తే ఊరంతా పరుగో పరుగు! వీడియో వైరల్

మేడపి, సెప్టెంబర్ 23: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపిలోని వీరబ్రహ్మచారి అనే వ్యక్తి నివాసంలోకి వచ్చిన రెండు అడుగుల పొడవు ఉన్న పాము కలకలం సృష్టించింది. భయాబ్రాంతులైన ఆ కుటుంబం స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం ఇచ్చారు. అక్కడ కు వచ్చిన స్నేక్ క్యాచర్ ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ పాము అలీవ్ కీల్ బ్యాక్ అని, విషరహితమని తెలిపారు. దీని వలన ప్రమాదం ఉండదని మల్లికార్జున స్థానికులకు తెలిపారు. ఇలాంటి పాములు ఈ ప్రాంతంలో అరుదుగా కనిపిస్తుంటాయని అన్నారు. ఇక పామును సురక్షితంగా పట్టుకున్న మల్లికార్జున.. అనంతరం సమీపంలోని అడవిలో వదిలేసినట్లు మల్లికార్జున అన్నారు. పాలు వ్యవహారం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.

వర్షాకాలం కావడంతో వెచ్చదనం కోసం పాములు ఇళ్లలోకి ప్రవేశించడం షరా మామూలే. అందుకే ఈ కాలంలో ఇళ్ల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముళ్లపోదలు, గట్టి వంటివి ఉంటే వాటిని శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు. సాధారణంగా ఈ కాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, జనాలు అప్రమత్తతో వ్యవహరిస్తే పాముల దాడి నుంచి బయటపడొచ్చని పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *