
ఏపీలో నకిలీ బెట్టింగ్ యాప్ మోసం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయల్‌పేటలో ఈ బెట్టింగ్ యాప్ మోసం వెలుగులోకొచ్చింది. మొబైల్ షాప్ నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ యాప్‌తో పలువురిని మోసం చేసిన చంద్రబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తానే ఓ బెట్టింగ్ యాప్ క్రియేట్ చేసి సుమారు 5 కోట్లు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. డబ్బు ఆశ చూసి బెట్టింగ్ యాప్‌లో అకౌంట్ తెరిపించడమే కాకుండా… బెట్టింగ్ పెట్టేలా ప్రోత్సాహించినట్లు వెల్లడించారు. ఈ చంద్రబాబు బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌తో పాటు పోలీసులు కూడా ఉండటం షాక్‌కు గురిచేస్తోంది. ఇక నిందితుడిని మదనపల్లి సబ్ జైలుకు పంపిన అధికారులు… లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాయల్ పేటలో క్రికెట్ బెట్టింగ్ యాప్ తో నిందితుడు.. రూ.కోట్లు కొట్టేసినట్లు స్థానికులు తెలిపారు.
పూర్తి వివరాలివే..
రాయల్ పేట కేబుల్ ఆపరేటర్ లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. మొబైల్ షాప్ పేరుతో వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అనే యువకుడు.. క్రికెట్ బెట్టింగ్ యాప్ వ్యవహారం నడిపించాడు.. రాదే ఎక్స్చేంజ్ పేరుతో క్రికెట్ బెట్టింగ్ యాప్ సృష్టించి పలువురి నుంచి డబ్బులు దండుకున్నాడు.. క్షణాల్లో. రూ కోట్ల సంపాదన అంటూ నమ్మించి క్రికెట్ బెట్టింగ్ బరిలోకి దించి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు ఆశ చూపి బ్యాంకు ఖాతాలు తెరిపించి మోసాలకు పార్పడ్డాడని.. వారి బ్యాంకు ఖాతాలకు తన మొబైల్ నెంబర్ అనుసంధానం చేసి.. ఖాతాదారునికి తెలియకుండా లావాదేవీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
డిష్ ఆపరేటర్ లక్ష్మీనారాయణ తన ఖాతాలో జరిగిన రూ.కోటి మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించి.. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ బెట్టింగ్ కేసులలో చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు.. బాధితుల్లో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, క్రీడాభిమానులు ఉన్నారని.. ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..