నేటి కాలంలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక చదువుల ఖర్చులైతే మోత మోగిస్తున్నాయి. దీంతో యువత ఎక్కువ డబ్బు సంపాదించగల ఉద్యోగాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే, పని ఒత్తిడి, టార్గెట్లు కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అందుకే కొంతమంది జీతం తక్కువగా ఉన్నప్పటికీ ఒత్తిడి లేని ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం భారత్‌లోని జాబ్ మార్కెట్లో ఒత్తిడి లేని ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే ఈ ఉద్యోగాలలో కొన్నింటికి జీతం కూడా వస్తుంది. ఇలా ఒత్తిడి లేని, అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఏమేం ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
గ్రాఫిక్ డిజైన్
గ్రాఫిక్ డిజైన్.. ఒత్తిడి లేని ఉద్యోగాలలో ఒకటి. దీనికి ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. సాధారణంగా గ్రాఫిక్ డిజైనర్లు విజువల్ మెటీరియల్స్, బ్రాండింగ్ మొదలైన వాటిని సృష్టిస్తారు. ఈ పనులకు వారికి ఆఫీసులతో అవసరం లేదు. కాన్వా, అడోబ్ సూట్, ఫిగ్మా వంటి సాధనాలు గ్రాఫిక్ డిజైన్‌ను సులభతరం చేస్తాయి. దీని ద్వారా సృజనాత్మకంగా జాబ్ చేసేందుకు స్వేచ్ఛ దొరుకుతుంది. సోషల్ మీడియా విభాగాలు, ప్రచురణ సంస్థలు, ప్రకటనల ఏజెన్సీలు, టెక్ స్టార్టప్‌లలో గ్రాఫిక్ డిజైనర్లకు యమ డిమాండ్ ఉంది.
కంటెంట్ రైటింగ్, కాఫీ రైటింగ్ ఉద్యోగాలు
డిజిటలైజేషన్ కారణంగా కంటెంట్ రైటింగ్ చాలా డిమాండ్ ఉన్న ఉద్యోగంగా మారింది. SEO-ఫ్రెండ్లీ బ్లాగ్ పోస్ట్‌లు, వెబ్‌సైట్ కంటెంట్, సోషల్ మీడియా పోస్ట్‌లు రాసే వారికి అధిక డిమాండ్ ఉంది. ఇందులో వర్క్ ఫ్రం హోం సౌకర్యం కూడా ఉంది. నచ్చిన పని గంటలలో పనిచేయడం, ఒత్తిడి లేని పని సంస్కృతి హాయిగా అనిపిస్తుంది. ఆఫీస్ టార్గెట్లు లేకపోవడం వల్ల ఇది ప్రశాంతమైన ఉద్యోగాల లిస్టులో చేరిపోయింది. స్టార్టప్‌లలో, ఆన్‌లైన్ ఏజెన్సీలలో, ఫ్రీలాన్స్ వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటింగ్, కాఫీ రైటింగ్‌కు అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
న్యూట్రీషియన్లు, డైటీషియన్లు ఉద్యోగాలు
ప్రస్తుతం భారత్‌లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెరుగుతోంది. దీనితో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్టులకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఆ విధంగా ఆసుపత్రులు, క్లినిక్‌లు, జిమ్‌లలో శిక్షణ పొందవచ్చు. సర్టిఫైడ్ పొందిన తర్వాత వారు ఇలాంటి కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. క్లయింట్‌లను సంప్రదించడం, ఇతరులకు ఆరోగ్య చిట్కాలు ఇవ్వడం వల్ల ఈ ఉద్యోగం ఒత్తిడి లేనిదిగా యువత భావిస్తున్నారు. దీనికి కూడా డిమాండ్ పెరుగుతోంది.
లైబ్రేరియన్, ఆర్కైవిస్ట్ ఉద్యోగాలు
లైబ్రేరియన్, ఆర్కైవిస్ట్ అనేది సంప్రదాయం, ఆధునికతను మిళితం చేసే ఉద్యోగం. హడావిడి లేకుండా పనిచేయడం, క్రమం తప్పకుండా పని గంటలు, గడువులు లేకుండా పనిచేయడం ఈ ఉద్యోగానికి ప్లస్ పాయింట్. విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలలు, వర్చువల్ లైబ్రరీలు ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి.
టీచింగ్ ఉద్యోగాలు
ప్రస్తుతం టీచింగ్‌కు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే వివిధ యాప్‌లు వచ్చాయి. దీని ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్నారు. అదేవిధంగా AI రాక కూడా దీనికి సహాయపడుతోంది. ఈ ఉద్యోగం ఒత్తిడి లేనిది. మీరు ఆన్‌లైన్‌తో పాటు BYJU’S, Vedantu, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా టీచింగ్ చేయవచ్చు.
UX/UI డిజైనర్ ఉద్యోగాలు
ఈ ఉద్యోగం పరిశోధన, సృజనాత్మక స్వేచ్ఛను అందిస్తుంది. ఒత్తిడి లేకుండా జాబ్ చేయవచ్చు. వీరికి మొబైల్ యాప్ కంపెనీలు, స్టార్టప్‌లు, IT కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.