అది చిన్నదైనా.. పెద్దదైనా పాము.. పామే.. సాధారణంగా మనం పాములను చూస్తేనే.. పరుగులు తీస్తాం.. ఇక కింగ్ కోబ్రా, పైథాన్ లాంటి పాములను చూస్తే ఇంకేముంది.. అమ్మబాబోయ్ అంటూ గుండె చేతిలో పట్టుకోవడమే.. గజగజ వణికిపోతూ ఆ ప్రాంతంలోనే అస్సలు ఉండము.. విష నాగుల భయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. అవి కాటేస్తే ప్రాణాలకే ప్రమాదం.. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ప్రమాదం.. అందుకే పాముల దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సహసం చేయరు.. అయితే.. తాజాగా.. అనకాపల్లి జిల్లాలో ఓ గిరినాగు హల్‌చల్ చేసింది.. అది బుసలు కొడుతుంటే చూసి జనం పరుగులు తీశారు.. చివరకు స్నేక్ క్యాచర్ వచ్చి రెస్క్యూ చేస్తుండగా.. అది అందరినీ చెమటల పట్టించింది. అస్సలు తగ్గేదేలే అంటూ బుసలు కొడుతూ.. స్నేక్ క్యాచర్ కు రివర్స్ తిరిగింది.
గిరినాగు హల్ చల్ చేసిన ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మం రైవాడ కాలువ దగ్గర చోటుచేసుంది.. కాలువలో భారీ గిరినాగును గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. చివరకు ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యుడు కృష్ణ అక్కడకు చేరుకుని.. రెండు గంటల పాటు శ్రమించి గిరినాగు రెస్క్యూ చేశాడు.
వీడియో చూడండి..
కాలువలో సంచరిస్తున్న గిరినాగును స్నేక్ క్యాచర్ బయటకు తీసుకొచ్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.. కృష్ణ చాలా సేపు శ్రమించి గిరినాగును బయటకు తీసుకొచ్చి బంధించేందుకు ప్రయత్నం చేయగా.. అది రివర్స్ అటాక్ చేయబోయింది.. చివరకు దానిని చాకచక్యంగా బంధించి అటవీ శాఖ సిబ్బంది సమక్షంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..