Navaratri: నవరాత్రిలో ఈ పరిహారాలు చేయండి.. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..

Navaratri: నవరాత్రిలో ఈ పరిహారాలు చేయండి.. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..


నవరాత్రి సమయంలో భక్తులు అమ్మవారి తొమ్మిది రూపాలకు అంకితభావంతో పూజలు చేస్తారు. అంతేకాదు నవరాత్రి సమయంలో భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ప్రస్తుతం శారదీయ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, నవరాత్రి సమయంలో మీ జీవితానికి ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి.. జ్యోతిషశాస్త్రంలో వివరించిన కొన్ని సాధారణ నివారణలను ప్రయత్నించవచ్చు. శారదీయ నవరాత్రి సమయంలో సంపదను పొందడానికి ఏ పరిహారాలు ఫలవంతమో ఈ రోజు తెలుసుకుందాం..

నవరాత్రి సమయంలో సంపద పొందడానికి చర్యలు ఏమిటంటే

  1. లక్ష్మీదేవి ఆరాధన: నవరాత్రి సమయంలో లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి “ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః” అని జపించండి.
  2. తొమ్మిది రోజుల పూజ: నవరాత్రి సమయంలో ప్రతిరోజూ దుర్గాదేవికి ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వండి, ఇది సంపద వృద్ధికి ద్వారాలు తెరుస్తుంది.
  3. నిత్య జ్యోతిని వెలిగించడం: నవరాత్రి సమయంలో నిత్య జ్యోతిని వెలిగించడం మాతృదేవత శక్తికి చిహ్నం . ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది.
  4. లవంగాల నివారణ: నవరాత్రి సమయంలో రెండు లవంగాలు, తమలపాకు కట్టను పసుపు రంగు వస్త్రంలో చుట్టి.. అమ్మవారి ముందు ఉంచండి. నవరాత్రి చివరి రోజున దీనిని భద్రంగా ఉంచండి.
  5. ఇవి కూడా చదవండి

  6. దుర్గా సప్తశతి పారాయణం: నవరాత్రులలో ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ రోజున దుర్గా సప్తశతి పారాయణం చేయండి.
  7. ఇంటి శుభ్రత: నవరాత్రి సమయంలో ఇంటిని శుభ్రం చేసి అలంకరించండి, ఎందుకంటే పరిశుభ్రమైన వాతావరణం లక్ష్మీ దేవిని ఆకర్షిస్తుంది.
  8. లవంగాలు, కర్పూరం వెలిగించండి: నవరాత్రి సమయంలో ఇంటి లోని ప్రతికూల శక్తిని తొలగించడానికి.. ప్రతిరోజూ రెండు లవంగాలు, కర్పూరాన్ని వెలిగించండి.
  9. ఎర్రటి పువ్వులు: నవరాత్రి సమయంలో అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే మందారాలు, గులాబీలు, కలువ పువ్వులు వంటి పువ్వులను సమర్పించండి. ఇది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  10. లవంగాల నివారణ: నవరాత్రి తొమ్మిది రోజులు.. ప్రతిరోజూ దుర్గాదేవికి ఒక జత లవంగాలను, ఒక గులాబీ పువ్వును సమర్పించండి.
  11. బియ్యంతో చేసిన పాయసాన్ని నివేదన: నవరాత్రి సమయంలో లక్ష్మీ దేవికి పాయసం నివేదన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *