Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో బంగ్లాదేశ్.. కేవలం ఒక మ్యాచ్‌తో అదెలా ఎలా సాధ్యం?

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో బంగ్లాదేశ్.. కేవలం ఒక మ్యాచ్‌తో అదెలా ఎలా సాధ్యం?


Asia Cup 2025 : ఆసియా కప్ 2025 విజేత ఎవరో సెప్టెంబర్ 28న తేలిపోతుంది. అయితే ఏ రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగుతుందో మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. గ్రూప్ స్టేజ్ పూర్తయిన తర్వాత జరిగే సూపర్-4 రౌండ్ మ్యాచ్‌ల తర్వాతే ఫైనల్ జట్లు ఖరారు అవుతాయి. కానీ, ఈ టోర్నమెంట్‌లో అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం. అయితే, టీమ్ ఇండియాను ఫైనల్‌లో ఎదుర్కొనేది ఎవరు అనేది చూడాలి. అయితే సూపర్-4 మ్యాచ్‌లు పూర్తి కాకముందే ఫైనల్ జట్లు నిర్ణయం అయ్యాయని చెబితే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ, ఒక ఫలితం ఆ విధంగానే కనిపిస్తోంది. ఆ జట్టు మరెవరో కాదు, బంగ్లాదేశ్.

బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరడం ఖాయమేనా?

సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లోనే అఫ్గానిస్తాన్ టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లిపోయింది. అఫ్గానిస్తాన్‌ను ఓడించడంలో బంగ్లాదేశ్ కీలక పాత్ర పోషించింది. అందుకే భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్-4 రౌండ్‌కు చేరుకుంది. అయితే గ్రూప్ స్టేజ్ తర్వాత బంగ్లాదేశ్ మరో షాకింగ్ ఫలితం ఇచ్చింది. ఫైనల్ రేసులో ఉన్న మరో జట్టు శ్రీలంకను ఓడించింది.

శ్రీలంకను ఎప్పుడైతే ఓడించిందో..

శ్రీలంకపై సాధించిన ఈ ఒక్క గెలుపు బంగ్లాదేశ్‌కు ఫైనల్‌కు వెళ్లే అవకాశాలను పెంచింది. అంతేకాకుండా చరిత్రను పరిశీలిస్తే, బంగ్లాదేశ్ ఫైనల్‌కు వెళ్లడం ఖాయమనిపిస్తుంది. గత 13 సంవత్సరాలలో, బంగ్లాదేశ్ ఎప్పుడైతే శ్రీలంకను ఆసియా కప్‌లో ఓడించిందో, ఆ టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. 2012లో బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించి, మొదటిసారి ఫైనల్ ఆడింది. అయితే ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. 2016లో బంగ్లాదేశ్ మరోసారి శ్రీలంకను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈసారి టీమ్ ఇండియా చేతిలో ఓడిపోయింది. 2018లో బంగ్లా టైగర్స్ మళ్లీ శ్రీలంకను ఓడించి మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఈసారి కూడా టీమ్ ఇండియా చేతిలో ఓడిపోయింది.

మళ్లీ బంగ్లాదేశ్‌కు అదృష్టం కలిసొస్తుందా?

ఈసారి కూడా టీమ్ ఇండియా ఫైనల్‌కు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కనుక ఈసారి కూడా ఫైనల్‌లో టీమ్ ఇండియా బంగ్లాదేశ్‌తో తలపడితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి యాదృచ్ఛిక సంఘటనలు క్రికెట్ చరిత్రలో చాలా సార్లు జరిగాయి. ఈసారి కూడా అదే జరిగితే ఇండియా-బంగ్లాదేశ్ ఫైనల్ ఖాయం.

ఆసియా కప్ అనేది క్రికెట్ అభిమానులకు ఒక గొప్ప విందు. గ్రూప్ స్టేజ్, సూపర్-4 మ్యాచ్‌లు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. అయితే, గత రికార్డులను చూస్తే బంగ్లాదేశ్ అదృష్టం ఆ టీమ్‌కు కలిసొచ్చి ఫైనల్‌కు చేరవచ్చనిపిస్తుంది. కానీ, క్రికెట్‌లో ఏమైనా జరగవచ్చు. ఫైనల్ రోజు ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *