మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇండోర్ లో మూడంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల చాలా మంది ఉన్నారు. ఇద్దరు మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని జిల్లా కలెక్టర్ శివం వర్మ తెలిపారు. క్షతగాత్రుల్లో 12 మంది మహారాజా యశ్వంతరావు ప్రభుత్వ ఆసుపత్రి (MYH)లో చికిత్స పొందుతున్నారు. మృతులను అలీఫా, ఫహీమ్‌గా గుర్తించారు.
కూలిపోయిన భవనం శిథిలాల కింద చిక్కుకున్న అలీఫా (20)ను మహారాజా యశ్వంత్ రావు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునే లోపే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ అరవింద్ ఘంఘోరియా తెలిపారు.
ఇవి కూడా చదవండి
8 నుంచి 10 సంవత్సరాల నాటి భవనం
సహాయక చర్యలు ఐదు గంటల పాటు జరిగినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. భవనం ముందు భాగం ఇటీవల పునరుద్ధరించబడింది.. అయితే వెనుక భాగం పాతది. భవనం పునాది పరిస్థితిని మేము పరిశీలిస్తున్నాము. కూలిపోయిన భవనంలో కొంత భాగం సమీపంలోని భవనంపై పడిందని మేయర్ పుష్యమిత్ర భార్గవ తెలిపారు. భవనం 8 నుంచి 10 సంవత్సరాల నాటిదని ప్రాథమిక సమాచారం సూచిస్తుంది.
సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇండోర్‌లోని రాణిపూర్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంత ఆ ప్రాంతాన్ని ఒక్కాసరిగా ఉల్కిపడేలా చేసింది. తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల కోసం ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన ఒక బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది.
కూలిన మూడంతస్తుల భవనం..
సమీపంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టేషన్ ఇన్చార్జ్ సంజు కాంబ్లే మాట్లాడుతూ మూడంతస్తుల భవనం కూలిపోయిందని తెలిపారు. రెండు జెసిబి యంత్రాలు శిథిలాలను తొలగిస్తున్నాయని తెలిపారు. సంఘటన స్థలంలో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. స్థానికుల ప్రకారం నిరంతర వర్షం కారణంగా భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది బయట ఉండటం వల్ల పెను ప్రాణ నష్టం తప్పింది.
#WATCH | Indore, MP | Collector Shivam Verma said, “There were 13 people in this house, out of which 10 have been rescued and sent to the hospital… Efforts are underway to rescue the remaining 3 people. The SDRF and municipal corporation teams are working… Our priority is to… https://t.co/nt8UKC2uFX pic.twitter.com/UjrKl1tjaR
— ANI (@ANI) September 22, 2025
గాయపడిన వారిని MY ఆసుపత్రిలో చికిత్స
ప్రమాదంలో గాయపడిన వారు MY ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా, విద్యుత్ సంస్థ మొత్తం ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుపోయి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించడానికి సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. సంఘటన గురించి సమాచారం అందిన తరువాత, అధికారులు, ప్రజా ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..