Bigg Boss Telugu 9: మళ్లీ తనే టార్గెట్.. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌ లో టాప్ కంటెస్టెంట్స్

Bigg Boss Telugu 9: మళ్లీ తనే టార్గెట్.. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌ లో టాప్ కంటెస్టెంట్స్


బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు హౌస్ లోకి అడుగు పెట్టగా, ఇప్పటికే ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. సెలబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ, కామనర్ల నుంచి మనీష్‌ మర్యాద ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడిక మూడోవారం నామినేషన్స్‌ జరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ ఈసారి కొన్ని రూల్స్ పెట్టాడు. టెనెంట్లు.. ఐదుగుర్ని నామినేట్‌ చేయాలని, అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్‌ అయుండాలని కండిషన్ పెట్టాడు. దీంతో హరీశ్‌, ప్రియ, శ్రీజ సంజనాను నామినేట్ చేశారు. అలాగే రీతూ చౌదరి, సుమన్‌, ఫ్లోరాను నామినేట్‌ చేశారు. చివరకు టెనెంట్స్‌లో ఒకర్ని అనగానే అందరూ కలిసి హరీశ్‌ను నామినేషన్స్‌లో నిలబెట్టారు.

మొత్తానికి మూడో వారం నామినేషన్స్ హౌస్ లో ఒక చిన్న పాటి యుద్ధాన్నే తలపించాయి. శ్రీజ, హరిత హరీష్, ప్రియాశెట్టి, సంజన, ఫ్లోరా సైనీ, ఇమ్మాన్యుయేల్, భరణి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. రాము రాథోడ్, రీతూ చౌదరీ, ప్రియా, హరిత హరీష్, కల్యాణ్, ఫ్లోరా షైనీ నామినేషన్స్ లో నిలిచిన వారిలో ఉన్నారు. అయితే ఇప్పటికే ట్విస్టులపై ట్విస్టులు ఇచ్చాడు బిగ్ బాస్. మరి మంగళవారం ఏమైనా ట్విస్టులు ఇస్తాడేమో చూడాలి. అలా జరిగితే నామినేషన్స్ లిస్టు మళ్లీ మారిపోవచ్చు.

మూడో వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

మళ్లీ హరిత హరీశే టార్గెట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *