తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలా.. పరకామణి వ్యవహారం కూడా పాన్ ఇండియా లెవల్ ఇష్యూలా మారుతోంది. దీనిపై ఇప్పటికే అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా..ఈ చోరీపై సిట్ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు మంత్రి లోకేష్. అటు వైసీపీ మాత్రం సిట్‌తో కాదు సీబీఐను రంగంలోకి దించాలని డిమాండ్ చేస్తోంది.
పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపించేశారని లోకేష్ ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చిట్‌చాట్‌లో చెప్పారు. దేవుడిని కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని..సిట్ విచారణకు ఆదేశించి ఈ వ్యవహారంలో నిజాలు తేలుస్తామని తేల్చిచెప్పారు. జగన్ అండ్ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారని.. అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడని వ్యాఖ్యానించారు లోకేష్.