నా ప్రియుడు నాకు నరకం చూపించాడు.. లైంగికంగా వేధించాడు.. ఆర్జీవీ హీరోయిన్ ఎమోషనల్

నా ప్రియుడు నాకు నరకం చూపించాడు.. లైంగికంగా వేధించాడు.. ఆర్జీవీ హీరోయిన్ ఎమోషనల్


హీరోయిన్స్ చాలా మంది సినిమాల్లో గ్లామర్ గా కనిపించి ఆకట్టుకుంటూ ఉంటారు.. కానీ వారి వ్యక్తిగత జీవితంలో మాత్రం.. ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది డిప్రషన్ కారణంగా ఊహించని నిర్ణయాలు తీసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక చాలా మంది హీరోయిన్స్ ప్రియుడి చేతిలో, భర్త చేతిలో మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు మీడియా ముందో లేదా సోషల్ మీడియాలోనో తమ బాధను వ్యక్తం చేశారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ప్రియుడి చేతిలో నరకం అనుభవించా.. అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

సంచలన  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంగవీటి’ చిత్రంతో పరిచయమైన నటి నైనా గంగూలీ. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ‘వంగవీటి’లో రత్నా కుమారి పాత్రలో ఆకట్టుకున్న ఆమె, తర్వాత ‘చరిత్రహీన్’ వెబ్ సిరీస్, ‘డేంజరస్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. ఇటీవల నైనా గంగూలీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న బాధలను బయట పెట్టింది.

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” నేనుప్రియుడి చేతిలో నరకం చూశాను. అతను నన్ను కొట్టడం, బెదిరించడం చేశాడు. ఇది ప్రేమ కాదు, హింస. దాని కారణంగా నేను ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాను అని ఎమోష్నలైంది. అలాగే కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న అతను నన్ను లైంగికంగా వేధించాడు. ప్రతి నిమిషం భయంగా ఉండేది. ఇది నా జీవితాన్ని నాశనం చేసింది. ప్రేమలో ఉన్నందుకు తగిన శాస్తి పొందాను. అది నా మనసును కుంగదీసింది. కానీ, ఇప్పుడు బలంగా మారాను. మహిళలు ఇలాంటి సంబంధాల నుంచి బయటపడాలి. రామ్ గోపాల్ వర్మ నన్ను పరిచయం చేశారు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎదురైన హింస వల్ల నేను హైదరాబాద్‌కు కూడా దూరమయ్యాను. ఇది నా కెరీర్‌కు పెద్ద దెబ్బ  అని చెప్పుకొచ్చింది నైనా గంగూలీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *