ఈ రోజుల్లో గ్రీన్ టీ ట్రెండ్ అవుతోంది. అయినప్పటికీ కొంతమంది ఇప్పటికీ మిల్క్ టీపై ఆధారపడతారు. మంచి ఆరోగ్యం కోసం వైద్యులు గ్రీన్ టీ తాగమని సిఫార్సు చేస్తున్నారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి పరిస్థితులకు గ్రీన్ టీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, లెమన్ టీ, బ్లాక్ టీ, కాఫీ డికాక్షన్ సహా అనేక ఇతర టీలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో ఒకటి మందార టీ. ఈ టీ గ్రీన్ టీ వలె ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టీని తాగడం వల్ల చక్కెర తక్షణమే నియంత్రణలో ఉంటుంది. మందార టీ తాగడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి ఇతర వ్యాధులకు గణనీయమైన ప్రయోజనాలు లభిస్తాయని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. మందారం టీ లాభాలేంటో ఇక్కడ చూద్దాం..
మందారం టీ తాగడం ద్వారా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌తో పాటు ట్రైగ్లిజరాయిడ్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు ఈ మందారం టీ తాగడం మంచిది. ఈ టీ రెగ్యులర్‌గా తాగడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే హైబీపీ సమస్యతో బాధపడేవారు ఈ హైబిస్కస్ టీ తాగడం మంచిది. హైబిస్కస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ తగ్గిస్తాయి. కీళ్లు, కండరాల్లో మంట, వాపు సమస్య రాకుండా కాపాడుతాయి. దీంతో ఆర్థరైటిస్ ముప్పు లేకుండా చూసుకోవచ్చు. హైబిస్కస్ టీలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. అలాగే కెఫిన్ ఉండదు. కాబట్టి బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
ధమనుల్లో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగించి రక్త ప్రసరణ మెరుగుపర్చడంలో ఈ హైబిస్కస్ టీ సహాయపడుతుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.హైబిస్కస్ టీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులోని పోషకాలు మెటబాలిజం రేటు మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంచుకోవచ్చు. హైబిస్కస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అతద్వారా షుగర్ అదుపులో ఉంటుంది. చర్మం హైడ్రేట్ అవుతుంది. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో మందారం టీ సహాయపడుతుంది. ఈ టీ కాలేయాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. తద్వారా కాలేయం సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.