Aadhaar: ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్‌లను లింక్‌ చేయవచ్చు?

Aadhaar: ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్‌లను లింక్‌ చేయవచ్చు?


Aadhaar Mobile Numbe Link: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) భారతదేశంలోని పౌరులకు ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. ఈ ఆధార్ కార్డులో 12 అంకెల సంఖ్యలు ఉన్నాయి. ఆధార్ కార్డులో 12 అంకెల సంఖ్య మాత్రమే కాకుండా పేరు, చిరునామా, వయస్సు, లింగం, వేలిముద్రలు, ఐరిస్‌ వంటి ముఖ్యమైన వివరాలు కూడా ఉంటాయి. ఈ ఆధార్ కార్డు ఒక వ్యక్తి భారతీయ పౌరుడని నిర్ధారిస్తుంది. దీని కారణంగా భారతదేశంలో ఆధార్ కార్డును వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: Traffic Rules: మీరు డ్రైవింగ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే ట్రాఫిక్‌ చలాన్‌ అస్సలు వేయరు!

ఒక మొబైల్ నంబర్‌కు ఒక ఆధార్ కార్డును మాత్రమే లింక్ చేయవచ్చా?

  1. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం.. ఒక మొబైల్ నంబర్‌కు బహుళ ఆధార్ కార్డులను లింక్ చేయడానికి అనుమతి ఉంది. కానీ దానిపై కొన్ని పరిమితులు ఉన్నాయి.
  2. ఒకే కుటుంబ సభ్యులు తమ ఆధార్ కార్డులను ఒకే మొబైల్ నంబర్‌కు లింక్ చేసుకోవచ్చు.
  3. ఇవి కూడా చదవండి

  4. ఉదాహరణకు, పిల్లలు తమ ఆధార్ కార్డులను వారి తండ్రి లేదా తల్లి మొబైల్ నంబర్‌కు లింక్ చేయవచ్చు.
  5. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఏ కుటుంబ సభ్యుడి ఆధార్ కార్డులను ఏ మొబైల్ నంబర్‌కైనా లింక్ చేయవచ్చు.
  6. కుటుంబ సభ్యులు కాని స్నేహితులు సహా ఎవరి ఆధార్ కార్డులను మొబైల్ నంబర్‌కు లింక్ చేయడానికి అనుమతి లేదు.

ఇది కూడా చదవండి: Bike Prices: గుడ్‌న్యూస్‌.. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ బైక్‌లపై భారీ తగ్గింపు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *