హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు తన స్మార్ట్‌ఫోన్ ద్వారా చెయిన్ స్నాచింగ్ ఎలా చేయాలో సెర్చ్ చేసి నేర్చుకున్నాడు. గూగుల్, యూట్యూబ్‌లలో గంటల తరబడి వీడియోలు చూసి చైన్ స్నాచింగ్ పద్ధతులను తెలుసుకున్నాడు. ఎవరి నుంచి సులభంగా దొంగిలించవచ్చు? ఆ తర్వాత ఎలా తప్పించుకోవాలి? ఎంత బంగారం, ఎంత డబ్బు వస్తుంది?.. ఇలాంటి విషయాలన్నీ రీసెర్చ్ చేశాడు. చివరికి నేర్చుకున్న విద్యను పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలో మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఓ యువతి రోడ్డు దాటుతుండగా.. నిందితుడు షేక్ అలీమ్.. ఆ యువతి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరుగెత్తాడు. అదే సమయంలో అక్కడ సివిల్ డ్రెస్‌లో విధులు నిర్వహిస్తున్నారు కానిస్టేబుల్స్ విక్రం, సిద్ధార్థ. యువతి గట్టిగా కేకలు వేయడంతో ఇద్దరూ అలర్టయ్యారు. సినిమాలో చూసినట్లు నడిరోడ్డుపై వెంబడించి, చివరికి షేక్ అలీమ్‌ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్‌లో చూసి చెయిన్ స్నాచింగ్‌లు చేయడం నేర్చుకుని మొదటి అటెంప్ట్‌లోనే పట్టుబడ్డాడని విచారణలో తేలినట్టు ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్‌కుమార్ తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి నిందితుడిని వెంబడించి పట్టుకున్న విక్రం, సిద్ధార్థ సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను ఏసీపీ ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మందుకొట్టి స్కూలుకొచ్చిన హెడ్‌మాస్టర్.. అధికారులపైనే
ఫోన్ పోగొట్టుకోవడంతో మొదలైన ప్రేమ కథ.. 32 ఏళ్ల వయసు తేడాతో ఒక్కటైన జంట
మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్.. మోదీ, పవన్ ప్రత్యేక అభినందనలు
Weather Update: తెలంగాణాలో మళ్ళీ జోరుగా కురుస్తున్న వర్షం
రజనీకాంత్‌కు గుడికట్టి పూజలు చేస్తున్న ఫ్యాన్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో