IND vs PAK: నీది AK-47 అయితే, వాళ్లది ‘బ్రహ్మోస్’ రా బచ్చా: పాక్ మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

IND vs PAK: నీది AK-47 అయితే, వాళ్లది ‘బ్రహ్మోస్’ రా బచ్చా: పాక్ మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్


IND vs PAK: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ కేవలం క్రీడలకే పరిమితం కాలేదు. మ్యాచ్ మధ్యలో పాకిస్తాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ AK-47 గన్ సంజ్ఞ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, ఈ సంజ్ఞకు భారత యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ తమ బ్యాటింగ్ ప్రదర్శనతోనే బ్రహ్మోస్ క్షిపణి లాంటి జవాబు ఇచ్చారని పాకిస్తాన్ మాజీ ఆటగాడు కనేరియా వ్యాఖ్యానించాడు.

సాహిబ్జాదా ఫర్హాన్ వివాదం..

పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్, అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత తన బ్యాట్‌ను AK-47 గన్‌లా పట్టుకుని భారత డగౌట్ వైపు సంజ్ఞ చేశాడు. ఈ చర్య చాలా మంది భారత అభిమానులకు, క్రికెట్ పండితులకు ఆగ్రహం తెప్పించింది. ఈ సంజ్ఞ కొన్ని నెలల క్రితం జరిగిన ఉగ్రవాద దాడిని గుర్తు చేసిందని విమర్శకులు వ్యాఖ్యానించారు.

గిల్, అభిషేక్ ‘బ్రహ్మోస్’ ప్రతిస్పందన..

సాహిబ్జాదా ఫర్హాన్ సంజ్ఞపై భారత ఆటగాళ్లు మాటలతో కాకుండా, తమ ఆటతోనే జవాబిచ్చారు. పాకిస్తాన్ పేస్ బౌలర్లైన షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్‌లపై శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించారు. అభిషేక్ శర్మ 24 బంతుల్లో అర్థ సెంచరీ చేసి, పాకిస్తాన్‌పై టీ20 మ్యాచ్‌లలో అత్యంత వేగంగా అర్థ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు, శుభ్మన్ గిల్ 42 బంతుల్లో 66 పరుగులు చేసి భారత్‌ను సునాయాసంగా గెలిపించారు. ఈ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను చూసి పాకిస్తాన్ మాజీ ఆటగాడు కనేరియా, ఫర్హాన్ AK-47 సంజ్ఞకు భారత్ ‘బ్రహ్మోస్’తో జవాబిచ్చిందంటూ బాంబ్ పేల్చాడు.

ఇవి కూడా చదవండి

“సాహిబ్‌జాదా ఫర్హాన్ AK-47 సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ బ్యాట్‌తో తమ సొంత బ్రహ్మోస్‌ను ప్రయోగించారు. అనంతరం శర్మ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. భారత ఓపెనర్ల ఎదురుదాడి చాలా విధ్వంసకరంగా ఉంది” అని కనేరియా సోమవారం IANS కి తెలిపాడు.

ప్రతిస్పందనలు..

పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో కూడా ఫర్హాన్ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. క్రీడా స్ఫూర్తికి ఇది విరుద్ధమని, అంతర్జాతీయ వేదికపై ఇటువంటి చర్యలు సరైనవి కావని పలువురు వ్యాఖ్యానించారు. అయితే, ఫర్హాన్ మాత్రం తాను కేవలం తన ఆనందాన్ని వ్యక్తం చేశానని, ఇతరులు ఏమనుకుంటున్నారో తనకు పట్టించుకోనని వివరణ ఇచ్చుకున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *