నిముషం వ్యవధిలోనే ఫ్లైట్ ఛార్జీలు మారిపోతుంటాయి. అందుకే వెబ్‌సైట్స్, బుకింగ్ ప్లాట్‌ఫామ్స్, టైమింగ్స్ వంటి కొన్ని ట్రిక్స్ సాయంతో ఫ్లైట్ టికెట్స్‌ను వీలైనంత తక్కువ ధరలకు పొందేందుకు ట్రై చేయాలి.
డిమాండ్ లేని రోజుల్లో
ఫ్లైట్ జర్నీని డిమాండ్ లేని రోజుల్లో ప్లాన్ చేసుకోవాలి. డిమాండ్‌ను బట్టి ఫ్లైట్ టికెట్ ధరలు మారతాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పండుగలు, వీకెండ్స్ కాకుండా మిగిలిన రోజుల్లో ప్రయాణాన్ని పెట్టుకోవాలి. సాధారణంగా మంగళ, బుధ వారాల్లో ఫ్లైట్ ఛార్జీలు తక్కువ. అలాగే దగ్గర్లో పండుగలు, పబ్లిక్ హాలిడేస్ లేనప్పుడు టికెట్ రేట్లు తక్కువ ఉంటాయి.
గూగుల్ ఫ్లైట్స్
‘గూగుల్ ఫ్లైట్స్’ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫ్లైట్ టికెట్ ఛార్జీలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయొచ్చు. ఏ రోజుల్లో జర్నీ చేయాలనుకుంటున్నారో డేట్స్, రూట్ డిటెయిల్స్ యాడ్ చేసి అలర్ట్స్ పెట్టుకుంటే ఫ్లైట్ ఛార్జీలు తగ్గినప్పుడు ఆటోమెటిక్ అలర్ట్స్ వస్తాయి. దీన్ని బట్టి తక్కువ రేటు ఉన్నప్పుడు వెంటనే టికెట్స్ బుక్ చేసుకునే వీలుంటుంది.
స్కైస్కానర్
‘స్కైస్కానర్’ అనే ప్లాట్‌ఫామ్ లో ఫ్లైట్ టికెట్ ఏ వెబ్‌సైట్‌లో తక్కువ ఛార్జీ ఉందో తెలుసుకోవచ్చు. ఆయా ఫ్లైట్ సర్వీసులు అందిస్తున్న అతి తక్కువ ధరలను ట్రాక్ చేయొచ్చు. వేర్వేరు వెబ్‌సైట్స్, ఎయిర్‌లైన్స్ వారీగా ఫ్లైట్ ఛార్జీలు తెలుసుకోవచ్చు. తరచుగా ఫ్లైట్ జర్నీలు చేసేవారికి ఈ ప్లాట్ ఫామ్ చాలా యూజ్ ఫుల్ గా ఉంటుంది.
ఇన్‌కాగ్నిటో
మొబైల్‌లో తరచుగా ఫ్లైట్స్ సెర్చ్ చేస్తున్న విషయాన్ని గూగుల్ పసిగట్టి ఆ సమాచారాన్ని బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు అందజేస్తుంది. దాంతో బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆటోమెటిక్‌గా రేట్లు పెరుగుతుంటాయి. అందుకే బ్రౌజర్‌లో ‘ఇన్‌కాగ్నిటో’ మోడ్ ఆన్ చేసి ఫ్లైట్స్ సెర్చ్ చేస్తే.. మీ సెర్చింగ్ యాక్టివిటీ ట్రాక్ అవ్వకుండా ఉంటుంది.
ఇకపోతే.. రెగ్యులర్ ఫ్లైట్ సర్వీసులతో పోలిస్తే నాన్‌స్టాప్ సర్వీసుల ధరలు తక్కువగా ఉంటాయి. అలాగే అర్ధరాత్రిళ్లు బుక్ చేయడం ద్వారా వీలైనంత తక్కువ ధరలకు టికెట్స్ బుక్ చేసుకునే వీలుంటుంది. ఇలాంటి సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడం ద్వరా రెగ్యులర్ గా కనిపించే రేట్ల కంటే తక్కువ రేటుతో ఫ్లైట్ టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి