SA vs PAK: దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్-బ్యాటర్ క్వింటన్ డి కాక్ వన్డే క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పాకిస్తాన్ పర్యటనకు ప్రకటించిన దక్షిణాఫ్రికా వన్డే, టీ20 జట్లలో అతడికి చోటు కల్పించారు. ఐసీసీ ప్రపంచ కప్ 2023 తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డి కాక్, ఇప్పుడు మళ్లీ జట్టులోకి రావడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.
ఎందుకు మళ్ళీ వచ్చాడు?
డి కాక్ వన్డేల నుంచి రిటైరైన తర్వాత అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. అయితే, దక్షిణాఫ్రికా కోచ్ శుక్రి కాన్రాడ్‌తో చర్చల తర్వాత డి కాక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దేశం తరపున ఆడాలనే తన కోరిక బలంగా ఉందని డి కాక్ చెప్పినట్లు కోచ్ కాన్రాడ్ తెలిపారు. “డి కాక్ తిరిగి రావడం జట్టుకు పెద్ద బూస్ట్. దేశం తరపున ఆడాలనే అతని ఆశయం చాలా బలంగా ఉంది. జట్టుకు అతను ఎలాంటి నాణ్యతను తీసుకొస్తాడో అందరికీ తెలుసు. అతని రాక జట్టుకు మేలు చేస్తుంది,” అని కాన్రాడ్ పేర్కొన్నారు.
జట్టులో ఇతర మార్పులు..
ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా దూరమయ్యారు. అతని స్థానంలో ఎయిడెన్ మార్క్రామ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా, వన్డేలకు మ్యాథ్యూ బ్రీట్జ్కే, టీ20లకు డేవిడ్ మిల్లర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) ప్రకటించింది. పాకిస్తాన్‌తో జరిగే ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఇవి కూడా చదవండి
డి కాక్ గణాంకాలు..
ఇప్పటివరకు 155 వన్డేలు ఆడిన డి కాక్, 45.74 సగటుతో 6,770 పరుగులు సాధించారు. ఇందులో 21 సెంచరీలు, 30 అర్థ సెంచరీలు ఉన్నాయి. టీ20లలో 92 మ్యాచ్‌లలో 31.51 సగటుతో 2,584 పరుగులు చేసి, 16 అర్థ సెంచరీలు, ఒక సెంచరీ సాధించారు. డి కాక్ తిరిగి రావడం జట్టు బ్యాటింగ్‌కు మరింత బలాన్ని చేకూర్చనుంది.
పాకిస్తాన్ పర్యటనకు దక్షిణాఫ్రికా వన్డే జట్టు:
మ్యాథ్యూ బ్రీట్జ్కే (కెప్టెన్), కార్బిన్ బోష్, డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, బిజోర్న్ ఫోర్టుయిన్, జార్జ్ లిండే, క్విన్నా మపాకా, లుంగి ఎన్గిడి, నఖబా పీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సినెథెంబా ఖెషీలే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..