ధనుస్సు: ప్రస్తుతం అర్ధాష్టమ శనితో అవస్థలు పడుతున్న ఈ రాశివారికి కష్ట కాలం ముగిసి, సుఖపడే సమయం ప్రారంభం అయింది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో స్థిరపడతారు. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.