హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యతో పాటు ఆమె కూడా బిగ్ బాస్‌లోకి..

హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యతో పాటు ఆమె కూడా బిగ్ బాస్‌లోకి..


బిగ్ బాస్ సీజన్ 9 మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే రెండు వారలు పూర్తి చేసుకుంది. మొదటి వారం హౌస్ నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అలాగే రెండో వారంలో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. సెకండ్ వీక్ లో ఊహించని విధంగా మనీష్ అవుట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 9లో గొడవలు, అల్లర్లు, ఎమోషన్స్ సాగుతున్నాయి. హౌస్ లో ఉన్న 15మందిలో ఇద్దరు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఓనర్లను , టెనెంట్స్ ను స్వైప్ చేశారు. సెలబ్రెటీలు ఇప్పుడు ఓనర్స్ గా మార్చేశారు నాగార్జున. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా మొదలయ్యాయి.

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

మూడో వారంలో హరీష్, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతూ వర్మ, ప్రియా, శ్రీజా నామినేషన్స్ లో ఉన్నారని తెలుస్తుంది. అలాగే సెకండ్ వీక్ కెప్టెన్ గా మారిన డిమాన్ పవన్ కు స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్స్ లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చెయ్యొచ్చు అని చెప్పాడు. దాంతో పవన్ రీతూని సేవ్ చేస్తాడనుకుంటే..ఊహించని విధంగా శ్రీజాను సేవ్ చేశాడు. దాంతో ఈసారి నామినేషన్స్ లో హరీష్, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతూ వర్మ, ప్రియా నామినేషన్స్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండనున్నాయని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

త్వరలోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండనుందని తెలుస్తుంది. ఈ వైల్డ్ కార్ట్ ఎంట్రీలో ఒక కామనర్ తోపాటు నలుగురు సెలబ్రెటీలు రానున్నారని తెలుస్తుంది. ఈమేరకు ఓ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారనే తెలుస్తుంది. 2.0 ఈవెంట్  పేరుతో ఐదో వారంలో ఈ వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని తెలుస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, సింగర్ శ్రీ తేజ, దివ్వెల మాధురి, జ్యోతి రాయ్‌‌ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. కామనర్ గా నాగ ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీరానుంది.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *