గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ బాగా పెరిగాయి. చాలామందిలో వీటిపై అవగాహన పెరిగి డబ్బుని బ్యాంకుల్లో కాకుండా ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.డబ్బును సేవింగ్స్ లో దాచుకోవడం కంటే ఇన్వెస్ట్ మెంట్స్ లో పెట్టడం చాలా లాభదాయకం అని చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా సజెస్ట్ చేస్తుంటారు. అయితే కొత్తగా ఇన్వెస్ట్ మెంట్స్ చేసేవాళ్లకు కొన్ని సందేహాలు ఉండడం కామన్. వాటిపై ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.
ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్
ఇన్వెస్ట్ మెంట్స్ అనేది కేవలం లాంగ్ టర్మ్ ను దృష్టిలో ఉంచుకుని చేయాలి. ఒకసారి ఇన్వెస్ట్ చేశాక వాటి గురించి ఎక్కువగా ఆలోచించ కూడదు. నాలుగైదు ఏళ్ల తర్వాత కచ్చితంగా లాభాలు వస్తాయనేది నిపుణులు చెప్పే మాట. అలాకాకుండా ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి పెరిగిందా? తగ్గిందా? అని తరచూ కంగారు పడడం మంచిది కాదు. ఇన్వెస్ట్ మెంట్స్ అన్నాక మార్కెట్ ను బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. కాభట్టి వాటి గురించి భయం లేనివాళ్లే ఇన్వెస్ట్ చేయాలి.
స్టాక్స్ లెక్క వేరు
మ్యూచువల్ ఫండ్స్ తో పాటు స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లు మీరు పెట్టబోయే కంపెనీ పని తీరుని బట్టి లాంగ్ టర్మ్‌ను దృష్టిలో ఉంచుకునే పెట్టుబడులు పెట్టాలి. అయితే వీటిలో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లా కాకుండా స్టాక్స్ ను తరచూ గమనిస్తూ ఉండడం మంచిది. మీరు ఎంచుకున్న కంపెనీ పని తీరు ఎలా ఉంది? దివాలా తీసే ప్రమాదం ఏమైనా ఉందా అన్నది గమనించాలి.
బ్యాలెన్స్‌డ్‌గా కూడా..
ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్ అయినా స్టాక్స్ అయినా.. ఇన్వెస్ట్ చేసేముందు ఆయా స్క్రీమ్స్ గురించి టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మీ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. రిస్క్ ను సేఫ్టీని బ్యాలెన్స్ చేస్తూ ఇన్వెస్ట్ చేసే విధానాలూ ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..