Nara Lokesh: దేవుడి దగ్గర నాటకాలు ఆడారు.. పరకామణి ఘటనపై సిట్ విచారణకు ఆదేశిస్తాం..

Nara Lokesh: దేవుడి దగ్గర నాటకాలు ఆడారు.. పరకామణి ఘటనపై సిట్ విచారణకు ఆదేశిస్తాం..


తిరుమల పరకామణి వ్యవహారాన్ని చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చోరీపై సిట్‌ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో నోటీసులు ఇచ్చి పంపించేశారని ఆరోపించిన మంత్రి..పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చిట్‌చాట్‌లో చెప్పారు. దేవుడిని కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని.. సిట్‌ విచారణకు ఆదేశించి ఈ వ్యవహారంలో నిజాలు తేలుస్తామని తేల్చిచెప్పారు. జగన్‌ అండ్‌ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారని.. అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడంటూ లోకేష్‌ వ్యాఖ్యానించారు.

కోట్లకు పడగలెత్తిన రవికుమార్..

పెద్ద జీయర్ మఠం క్లర్క్‌గా ఉన్న రవికుమార్‌ అనే వ్యక్తి.. 2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో చోరీ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి. రవికుమార్‌ తన లోదుస్తుల్లో దాచిన 900 అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు రవికుమార్‌పై చర్యలు తీసుకోకుండా..లోక్‌ అదాలత్‌లో రాజీ చేశారు అప్పటి అధికారులు. పరకామణిలో రవికుమార్‌ చోరీలకు పాల్పడ్డం తొలిసారి కాదని..గతంలో కూడా అనేకసార్లు దొంగతనాలు చేసి వందల కోట్లు కొట్టేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రవికుమార్ చోరీల వెనుక టీటీడీ అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు టీటీడీ బోర్డు మెంబర్‌ భాను ప్రకాశ్‌రెడ్డి. దీంతో లోక్ అదాలత్‌ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు..పరకామణి వ్యవహారంపై సీఐడీ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్‌లో అందివ్వాలని ఆదేశించింది.

అయితే.. పరకామణి వ్యవహారంపై హైకోర్టు సీఐడీ విచారణకు ఆదేశించడం..మరోవైపు సిట్‌తో దర్యాప్తు చేస్తామని మంత్రి లోకేష్‌ ప్రకటించడంతో ఆసక్తి నెలకుంది..

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *