IND vs PAK: ఆసియా కప్ 2025 ప్రస్తుతం యూఏఈలో జరుగుతోంది. సూపర్ ఫోర్ మ్యాచ్‌లు ఇప్పుడు జరుగుతున్నాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ (IND vs PAK) ఆదివారం రాత్రి ముగిసింది. ఇందులో భారత జట్టు వరుసగా రెండోసారి పాకిస్తాన్‌ను ఓడించింది.
లీగ్ దశలో కూడా భారత్ పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ ఆసియా కప్‌లో మూడోసారి ఇరుజట్లు (IND vs PAK) పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం..
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో (IND vs PAK) పాకిస్తాన్ జట్టు దూకుడుగా వ్యవహరించింది. భారత జట్టు ఆటగాళ్లతో కూడా దురుసుగా ప్రవర్తించారు. అయితే, భారత ఆటగాళ్లు పాకిస్తాన్ బౌలర్లపై భారీ షాట్లు కొట్టి తమదైన శైలిలో స్పందించారు.
సూపర్ ఫోర్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైంది. ఈ టోర్నమెంట్లో భారత్ ఇప్పటికే రెండుసార్లు పాకిస్థాన్‌ను ఓడించింది. అయినప్పటికీ, మూడోసారి ఇండియా vs పాకిస్తాన్ (IND vs PAK) మ్యాచ్ జరగవచ్చు. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
IND vs PAK మూడో మ్యాచ్ ఎప్పుడంటే..
ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ (IND vs PAK) ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాయి. సెప్టెంబర్ 14న జరిగిన మొదటి మ్యాచ్ లీగ్ దశ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించడంతో ఈ మ్యాచ్ కూడా తీవ్ర వివాదానికి దారితీసింది.
ఆ తర్వాత, సెప్టెంబర్ 21 ఆదివారం నాడు భారత్ వర్సెస్ పాకిస్తాన్ (IND vs PAK) మళ్ళీ తలపడ్డాయి. ఇలాంటి దూకుడు వైఖరి ఉన్నప్పటికీ, పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2025 ఆసియా కప్‌లో భారతదేశంపై వరుసగా రెండో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
సూర్య, సల్మాన్ జట్టు ఫైనల్లో ఢీ కొట్టే ఛాన్స్..
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మూడవ ఆసియా కప్ పోరు (IND vs PAK) ఎలా జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోవడానికి భారత జట్టుకు ఒకే ఒక్క విజయం అవసరం. భారత జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ క్రమంలో ఈ జట్లలో దేనినైనా ఓడిస్తే, ఫైనల్లో భారత జట్టు స్థానం ఖాయం అవుతుంది.
మరోవైపు, పాకిస్తాన్ సూపర్ ఫోర్లో భారత్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఆ జట్టు ఫైనల్‌కు చేరుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో తమ మ్యాచ్‌లను గెలిస్తే, 28వ తేదీన దుబాయ్‌లో మూడవసారి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది.
పాకిస్తాన్ మార్గం సులభం కాదు..
పాకిస్తాన్ తన తొలి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఫైనల్‌కు చేరుకోవడం చాలా కష్టమైన పని. శ్రీలంక, బంగ్లాదేశ్ రెండూ ఆసియా కప్‌లో బాగా రాణిస్తున్నాయి. ఈ రెండు జట్ల కంటే పాకిస్తాన్ వెనుకబడి ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి