అమెరికాలోని యూనియన్ కౌంటీ, పిక్నీ స్ట్రీట్‌లో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్ అనే భారతీయ మహిళ తన సొంత దుకాణం, డీడీస్ ఫుడ్ మార్ట్‌లో దోపిడీకి పాల్పడిన వ్యక్తిని ఎదుర్కొంది. దుండగుడు ఆమెపై కాల్పులు జరిపడంతో, ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. దుండగుడు ముసుగు ధరించి ఉన్నాడు. ఈ ఘటన స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానిక ప్రవాస భారతీయులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :