IND Vs PAK: మీ బుద్ది జన్మకు మారదురా.! గెలికి మరీ తన్నించుకున్నారుగా.. తెలిస్తే మీరూ తిట్టిపోస్తారు

IND Vs PAK: మీ బుద్ది జన్మకు మారదురా.! గెలికి మరీ తన్నించుకున్నారుగా.. తెలిస్తే మీరూ తిట్టిపోస్తారు


ఆసియా కప్ 2025 టోర్నీలోని సూపర్ ఫోర్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి ఉత్కంఠభరితమైన పోరుకు తెరలేపాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ తన హాఫ్ సెంచరీ సందర్భంగా చేసిన సెలబ్రేషన్ తీవ్ర వివాదానికి దారి తీసింది. పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. టీం ఇండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లను వదిలేయడంతో.. పాక్ దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఆ జట్టు ఓపెనర్ ఫర్హాన్ 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక హాఫ్ సెంచరీ అనంతరం అతడు చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారి తీసింది.

సిక్సర్ కొట్టిన అనంతరం తన బ్యాట్‌తో గన్ షాట్ మాదిరిగా సెలబ్రేట్ చేసుకోవడం భారత అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా పాక్‌ క్రికెటర్ల తీరు ఉందని మండిపడుతున్నారు. భారతీయులను రెచ్చగొట్టేలా మైదానంలో వెర్రిచేష్టలు చేశారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాట్‌ను తుపాకీగా చూపించిన పాక్‌ బ్యాటర్‌ ఫర్హాన్‌.. పహల్గాం ఉగ్రదాడిని గుర్తు చేసేలా ఆ సెలబ్రేషన్ ఉందని ఇండియన్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ వెర్రి ఇక్కడితో ఆగలేదు. బౌండరీ లైన్‌ దగ్గర ఫీలింగ్‌ చేస్తున్న హారిస్‌ రౌఫ్‌- విమానం కూలుతున్నట్లు సైగలు చేశాడు. ఆపరేషన్‌ సింధూర్‌లో భారతీయ జెట్‌ ఫైటర్లు కూలినట్లు పాక్‌ పదేపదే ఆరోపిస్తోంది. ఇప్పుడు క్రికెట్‌ మైదానంలో కూడా భారత్‌ను రెచ్చగొట్టేలా ఫైటర్‌ జెట్స్‌ కూలినట్లు రౌఫ్‌ సైగలు చేశాడు. పాక్‌ క్రికెటర్ల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఇద్దరు పాక్ క్రికెటర్లపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *