ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం ఈరోజు తెల్లవారుజామున 3:23 గంటలకు ముగిసింది. ఈ గ్రహణం ఆదివారం రాత్రి 10:59 గంటలకు సర్వ పితృ అమావాస్య రోజున సంభవించింది. గ్రహణం మొత్తం వ్యవధి 4 గంటల 24 నిమిషాలు. ఆదివారం చంద్రుడు సూర్యుని ముందు నుంచి వెళ్ళాడు. ఫలితంగా పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. దీని అర్థం సూర్యునిలో ఒక భాగం అస్పష్టంగా కనిపించింది. ఇది ప్రజలకు అరుదైన దృశ్యాన్ని అందించింది. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై ఈరోజు (సెప్టెంబర్ 22) తెల్లవారుజామున 3:23 గంటల వరకు కొనసాగింది. గ్రహణం గరిష్టంగా 1:11 గంటలకు కనిపించింది.
2026 లో సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
నివేదికల ప్రకారం తదుపరి సూర్యగ్రహణం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం సంభవిస్తుంది. ఇది వార్షిక సూర్యగ్రహణం అవుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు. 2026లో ఏర్పడే ఈ తొలి సూర్యగ్రహణం జింబాబ్వే, దక్షిణాఫ్రికా, జాంబియా, మొజాంబిక్, మారిషస్, అంటార్కిటికా, టాంజానియా, దక్షిణ అమెరికా దేశాలలో కనిపిస్తుంది.
ప్రపంచంలో ఎక్కడ గ్రహణం కనిపించింది?
ఇవి కూడా చదవండి
ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. ఇది ఫిజి, ఆస్ట్రేలియా, దక్షిణ న్యూజిలాండ్, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపించింది. ఈ గ్రహణం న్యూజిలాండ్‌లో ఎక్కువగా కనిపించింది. అక్కడ సూర్యుడు దాదాపు 80 శాతం కప్పబడి ఉన్నాడు. అయితే ఆసియా, ఆఫ్రికన్, అమెరికన్ దేశాలపై గ్రహణం ఎటువంటి ప్రభావం చూపలేదు. అయితే ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా గ్రహణాన్ని వీక్షించారు.
సూర్యగ్రహణం ఎందుకు సంభవిస్తుంది?
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒక కక్ష్యలో తిరుగుతాడు. భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు.. చంద్రుడు భూమిని అనుసరిస్తూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి సమయంలో చంద్రుడు భూమికి , సూర్యునికి మధ్య వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. పాక్షిక గ్రహణంలో సూర్యునిలో ఒక భాగం మాత్రమే అస్పష్టంగా ఉంటుంది. అయితే సంపూర్ణ గ్రహణంలో.. సూర్యుడు పూర్తిగా అస్పష్టంగా ఉంటాడు.
శారదీయ నవరాత్రులు.. సూర్యగ్రహణం ప్రభావం
ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. అందుకే సూర్యగ్రహణానికి ముందున్న సూతక కాలం చెల్లదు. ఇంకా గ్రహణం తర్వాత రోజు అంటే ఈరోజు ప్రారంభమైన శారదీయ నవరాత్రిపై దీని ప్రభావం లేదు.
ఈ రాశుల వారు ప్రభావితమవుతారు
ఆదివారం సర్వ పితృ అమావాస్య రోజున కన్య రాశిలో సంభవించిన సూర్యగ్రహణం చాలా ముఖ్యమైనది. భారతదేశంలో ఇది కనిపించక పోయినా .. ఈ సూర్యగ్రహణం పన్నెండు రాశులపై భిన్నమైన ప్రభావాలను చూపుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు