సినిమా కథల ఎంపికలో ఒక్కో హీరోకు ఒక్కో అంచనా ఉంటుంది. ఒక హీరోకు నచ్చని కథ మరో హీరోకు నచ్చచ్చు. అందుకే ఇండస్ట్రీలో సినిమా కథలు తరచూ చేతులు మారుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన కథ వివిధ కారణాలతో మరో హీరో చేస్తుంటాడు. అలా ఒక హీరో రిజెక్ట్ చేసి మరో హీరో తీసిన సినిమాలు ఒక్కోసారి బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. కొన్ని సార్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. అలా నాగ చైతన్య వద్దన్న ఒక కథతో హీరో నితిన్ సినిమా చేశాడు.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా ప్రేమకథా సినిమాలే చేస్తున్నాడు నాగ చైతన్య. ఏమాయ చేశావే, 100 పర్సెంట్ లవ్, ఒక లైలా కోసం, ప్రేమమ్, లవ్ స్టోరీ, రారండోయ్ వేడుక చూద్దాం, థ్యాంక్యూ, మజిలీ, తండేల్.. ఇలా చైతూ చేసిన లవ్ స్టోరీలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే మనం, బంగార్రాజు, వెంకీమామ వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కూడా ఉన్నాయి. ఇక నితిన్ కూడా ప్రేమకథా చిత్రాలతోనే ఆకట్టుకున్నాడు. జయం, దిల్, సంబరం, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్ అటాక్, చిన్నదాన నీ కోసం, చల్ మోహన్ రంగ, రంగ్ దే తదితర లవ్ స్టోరీ మూవీస్ చేశాడు నితిన్. కొన్ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్కినేని నాగ చైతన్యతో ఒక సినిమా తీసేందుకు రెడీ అయ్యాడట. త్రివిక్రమ్ సినిమాలంటేనే పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అలా చైతూతోనే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీయాలనుకున్నారట. అయితే అప్పటికే నాగ చైతన్య సినిమా డైరీ ఫుల్ అయ్యిందట. వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల త్రివిక్రమ్ మూవీ చేయలేకపోయాడట. దీంతో ఇదే కథను నితిన్ కు వినిపించాడు త్రివిక్రమ్. అతను కూడా వెంటనే ఒకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కింది. కట్ చేస్తే.. థియేటర్లలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు అ ఆ.
2016లో రిలీజైన అ ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో సమంత, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నదియ, నరేష్, రావు రమేశ్, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఒక వేళ అఆ మూవీని చేసి ఉంటే నాగచైతన్య కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యుండేది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.