ఈ అమ్మడి వయస్సు 24 ఏళ్ళు.. కానీ ఆస్తులు మాత్రం రూ. 250 కోట్లు. హీరోయిన్లకు మించి క్రేజ్ ఈ అందాల ముద్దుగుమ్మది. ఇన్‌ఫ్లూయన్సర్‌గా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారడమే కాదు.. ఇన్‌స్టా ఫాలోవర్స్‌లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ను మించిపోయింది. ఇక మరి ఆమె ఎవరని అనుకుంటున్నారా.. మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జన్నత్ జుబేర్ రహ్మానీ.
2001, ఆగష్టు 29న ముంబైలో పుట్టిన జన్నత్.. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2008లో చాంద్ కే పర్ చలో సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత దిల్ మిల్ గయే, కాశీ: అబ్ నా రహే తేరా కాగ్ కోరా, తు ఆషికి, ఫియర్ ఫైల్స్ వంటి షోస్‌లో నటించింది. అలాగే పలు హిందీ రియాల్టీ షోలలో పాల్గొంది. ఖత్రోన్ కే ఖిలాడీ, చెఫ్ షో లాంటి షోలలో నటించి.. సుమారు రూ. 20 లక్షలు వెనకేసుకుంది. అటు 21 ఏళ్ళకే జన్నత్ ముంబైలో సొంత ఇంటిని కొనేసింది. అటు సినిమాల్లో ఇటు బిజినెస్‌లో రెండింట సంపాదిస్తూ.. సుమారు రూ. 250 కోట్లు సంపాదించింది. ఇక జన్నత్‌కు ఇన్‌స్టాలో 50.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.