Chiranjeevi: మొదటి సినిమా రిలీజై 47 ఏళ్లు.. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పోస్ట్

Chiranjeevi: మొదటి సినిమా రిలీజై 47 ఏళ్లు.. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పోస్ట్


మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాది రాళ్లు. కానీ ఆ తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ అనే పాత్రను పోషించారు. రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలై నేటికి (సెప్టెంబర్ 22) 47 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ’22 సెప్టెంబర్ 1978.. ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే… అందుకు కారణం నిస్వార్ధమైన మీ “ప్రేమ”. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… కృతజ్ఞతలతో మీ చిరంజీవి’ అని ట్వీట్ చేశారు మెగాస్టార్.

ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్‌ రావిపుడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండింటితో పాటు శ్రీకాంత్‌ ఓదెల, బాబీ దర్శకత్వంలో నూ చిరంజీవి సినిమాలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి పోస్ట్..

మన శంకర వరప్రసాద్ గారు లో చిరంజీవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *