Actress: ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకటేశ్‏తో హిట్స్.. కట్ చేస్తే.. స్టార్ ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు రీఎంట్రీ..

Actress: ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకటేశ్‏తో హిట్స్.. కట్ చేస్తే.. స్టార్ ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు రీఎంట్రీ..


పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా.. ? తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే సినీరంగంలో తనకు స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీని ఏలేసిన ఈ వయ్యారి.. అప్పట్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, వెంకటేశ్, సిద్ధార్థ్, రానా వంటి స్టార్ హీరోలతో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు రీఏంట్రీ ఇచ్చింది. హిందీతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ జెనీలియా. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ ప్రత్యేకం.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..

ఇవి కూడా చదవండి

జెనీలియా.. బాయ్స్ సినిమాతో కథానాయికగా సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు 2003లో వచ్చిన తుజే మేరీ కసమ్ సినిమాతో బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది. ఇందులో రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటించారు. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ రూపొందించిన బాయ్స్ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో సత్యం, సాంబ, సై, నా అల్లుడు, హ్యాపీ, సుభాష్ చంద్రబోస్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సిద్ధార్థ్ హీరోగా వచ్చిన బొమ్మరిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఈ సినిమాలో అల్లరి పిల్ల హాసిని పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో హసినిగా నిలిచిపోయింది. మొదటి సినిమా చిత్రీకరణలో హీరో రితేష్ దేశ్ ముఖ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే హిందీలో వేద్, సితారే జమీన్ పర్ చిత్రాల్లో నటించింది. అలాగే జూనియర్ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *