ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ్యులు పలు విషయాలపై సభలో చర్చిస్తున్నారు. సోమవారం పది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. కాగా.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వరకు జరుగనున్నాయి. మెడికల్ కాలేజీల అంశంపై చర్చ జరగనుంది.. అంతేకాకుండా పలు బిల్లులను కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.. అయితే.. అసెంబ్లీలో మెడికల్ కాలేజీల వ్యవహారం మీద సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పనున్నారు.
శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి.. అయితే.. సభ ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది.. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైసీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు.