Tollywood : ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరోకు గర్ల్ ఫ్రెండ్.. ప్రియుడి మరణంతో జైలుకు.. చివరకు కెరీర్ ఖతం..

Tollywood : ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరోకు గర్ల్ ఫ్రెండ్.. ప్రియుడి మరణంతో జైలుకు.. చివరకు కెరీర్ ఖతం..


సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో అడుగుపెట్టింది. తెలుగు, హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ జనాలకు దగ్గరయ్యింది. తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. కెరీర్ ప్రారంభంలోనే ఊహించని విధంగా జైలుకు వెళ్లింది. ఓ స్టార్ హీరోను ప్రేమించింది. కానీ అతడి మరణంతో ఈ బ్యూటీపై కేసు నమోదు చేశారు. దీంతో నెల రోజులు జైలు జీవితం గడిపింది. అతడి మరణం తర్వాత నాలుగేళ్లకు ఈ కేసులో ఆమెకు క్లీన్ చీట్ లభించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా. ? మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. రియా చక్రవర్తి. తెలుగులో కేవలం ఒక్క సినిమాలోనే నటించింది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..

2020.. పాన్ ఇండియా సినీప్రియులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. కానీ సుశాంత్ ఆత్మహత్య వెనుక అతడి ప్రియురాలు హీరోయిన్ రియా చక్రవర్తి ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రతి రోజూ కొత్త సమాచారం బయటకు వచ్చింది. అలాగే సుశాంత్, రియాకు సంబంధించిన కొన్ని వీడియోస్ సైతం బయటకు వచ్చాయి. ఆమె సుశాంత్ ను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో సుశాంత్ మరణించిన దాదాపు నాలుగు సంవత్సరాల ఆరు నెలల తర్వాత ఆమెకు సీబీఐ నుంచి క్లీన్ చిట్ లభించింది. కానీ అప్పటికే రియా కెరీర్ క్లోజ్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

నాలుగు సంవత్సరాల ఆరు నెలల తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో తనకు క్లీన్ చిట్ లభించిన వెంటనే తాను కన్నీళ్లు పెట్టుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రియా. సుశాంత్ సూసైడ్ కేసు తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని.. ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చినప్పటికీ తాను సంతోషంగా లేనని తెలిపింది. తనకు ఇష్టమైన వ్యక్తి తన నుంచి దూరమయ్యాడని.. క్లీన్ చిట్ రావడంతో తన తల్లిదండ్రులకు ఉపశమనం లభించిందని అన్నారు. రియా చక్రవర్తి తెలుగులో తూనీగ తూనీగ సినిమాలో నటించింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *