IND vs PAK: ఒక్క మాటతో పాక్‌ పరువుతీసిన సూర్య భాయ్‌! ఓటమి బాధలో పాక్‌ను ఇంకా ఏడిపించేలా..

IND vs PAK: ఒక్క మాటతో పాక్‌ పరువుతీసిన సూర్య భాయ్‌! ఓటమి బాధలో పాక్‌ను ఇంకా ఏడిపించేలా..


2025 ఆసియా కప్ సూపర్ ఫోర్స్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాక్‌ పరువుతీశాడు. రెండు జట్ల మధ్య ఉన్న చారిత్రాత్మక పోటీ గురించి ప్రశ్నించినప్పుడు.. పోటీ ఏకపక్షంగా మారిందని అన్నారు. మీరందరూ ఈ రైవల్రీ గురించి ప్రశ్నలు అడగడం మానేయాలి. 15 లేదా 20 మ్యాచ్‌లు ఆడిన తర్వాత 7-7 లేదా 8-7 అయితే దాన్ని రైవల్రీ అనొచ్చు. కానీ, 13-0, 10-1 ఉంటే దాన్ని రైవల్రీ అనొద్దు.. వన్‌ వే ట్రాఫిక్‌ అవుతుంది.

మేం వారి కంటే మెరుగైన క్రికెట్ ఆడామని నేను భావిస్తున్నాను అని సూర్య పేర్కొన్నాడు. కొన్నేళ్లుగా పాకిస్థాన్‌పై భారత్‌ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అందుకే సూర్య పరోక్షంగా పాకిస్థాన్‌ అసలు తమకు పోటీ కాదని అన్నాడు. రైవల్రీ అంటే సమవుజ్జీల మధ్య జరిగే పోటీ అనే కోణంలో సూర్య వ్యాఖ్యలు చేశాడు. నిజానికి చాలా కాలంగా పాకిస్థాన్‌ భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే. 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి భారత్‌కు ఓపెనర్లు 105 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. ఈ ఆసియా కప్ ఎడిషన్‌లో ఇది తొలి సెంచరీ ప్లస్ భాగస్వామ్యం. అభిషేక్ 39 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు, గిల్ 28 బంతుల్లో ఎనిమిది బౌండరీలతో 47 పరుగులు చేశాడు. గిల్ 105 పరుగుల వద్ద ఔటైన తర్వాత, అభిషేక్ 13వ ఓవర్ వరకు ఆడుతూ హారిస్ రౌఫ్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు, సంజు శాంసన్‌ 13 పరుగులతో ఇబ్బంది పడ్డాడు. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ 26 పరుగుల అజేయ భాగస్వామ్యంతో లక్ష్యాన్ని పూర్తి చేశారు. వర్మ 19 బంతుల్లో 30 పరుగులు చేశాడు, పాండ్యా ఏడు బంతుల్లో ఏడు పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో శివమ్ దుబే 2, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *