Abhishek Sharma : పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించారు. తన బ్యాటింగ్‌తో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు. పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించడంలో ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లను చిత్తు చేస్తూ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. తన బ్యాటింగ్‌తో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. అంతర్జాతీయ టీ20ల్లో రెండుసార్లు ఫస్ట్ బాల్ కే సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో అభిషేక్ మరో వరల్డ్ రికార్డు సైతం నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 50 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును కేవలం 331 బంతుల్లోనే అభిషేక్ శర్మ సాధించారు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్ పేరిట ఉండేది. అతను 366 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
అభిషేక్-గిల్ జోడీ అదుర్స్..
అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ పాకిస్తాన్‌పై అద్భుతమైన ఓపెనింగ్ పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఇద్దరూ కలిసి మొదటి వికెట్‌కు ఏకంగా 105 పరుగులు జోడించారు. ఈ పరుగులు కేవలం 59 బంతుల్లోనే వచ్చాయి. పాకిస్తాన్‌పై టీమిండియా ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఈ భాగస్వామ్యంతోనే భారత్‌కు విజయం చాలా సులభమైంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 74 పరుగులు చేయగా, శుభమన్ గిల్ 47 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. వీరి అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా విజయం సులభమైంది.
Firing on all cylinders to get to his half-century! 🚀
Watch #INDvPAK LIVE NOW, on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/txzrHyWrrL
— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025
భారత్‌కు తిరుగులేదు
ఆసియా కప్ 2025లో టీమిండియా అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ దశలో పాకిస్తాన్‌ను ఓడించి, ఇప్పుడు సూపర్-4 మ్యాచ్‌లో కూడా వారిని చిత్తు చేసింది. జట్టు బ్యాటింగ్‌లో ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. అలాగే బౌలర్లు కూడా కీలక సమయాలలో వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు తిరుగులేదని మరోసారి రుజువయ్యింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..