ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ టోర్నీలో భారత్ చేతిలో పాక్‌కు ఇది రెండో పరాజయం. లీగ్ దశలో కూడా పాక్‌ను యువ భారత జట్టు ఘోరంగా ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రిజల్ట్ రిపీట్ అయింది. టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు అద్భుతంగా రాణించి, సూపర్ 4లో తొలి విజయాన్ని అందించారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ బౌలర్ చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలో కూర్చున్న కొంతమంది క్రికెట్ అభిమానులు సరదాగా కోహ్లీ.. కోహ్లీ.. అని అరవడం మొదలుపెట్టారు. 2022లో టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, పాక్ మ్యాచ్‌లో 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన సమయంలో రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన స్ట్రేయిట్ సిక్స్ దాన్నే షాట్ ఆఫ్ ది సెంచరీగా పిలుస్తున్నారు. ఆ షాట్‌తో కోహ్లీకి ఎంత పేరు వచ్చిందో.. రౌఫ్ పేరు కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. అయితే అది నెగిటివ్‌గా. దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రేక్షకులు కోహ్లీ.. కోహ్లీ.. అని అరిచారు.
దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న రౌఫ్.. ఒక విచిత్రమైన యాక్షన్ చేశాడు. ఒక ఫైటర్ జెట్ గాల్లో ఎగురుతూ, సడెన్‌గా కూలిపోయినట్లు యాక్షన్ చేశాడు. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రౌఫ్ ఈ ఫైటర్ జెట్ యాక్షన్ ఎందుకు చేశాడో అని క్రికెట్ అభిమానులు ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే రౌఫ్ కావాలనే ఇలా చేశాడని.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల సందర్భంగా భారత్‌కు చెందిన 6 ఫైటర్ జెట్లను తాము కూల్చేశామని అప్పట్లో పాక్ అర్థంలేని వాదనలు చేసింది. ఇప్పుడు రౌఫ్ ఇదే విషయాన్ని ఇలా యాక్షన్ రూపంలో ప్రస్తావించి ఉంటాడని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
Haris Rauf has been declared – The New ‘Field Marshal’ of Pakistan, after his hammering from 25 years old Abhishek Sharma 😂
– It’s like Brahmos hitting Nur Khan Base at Night 😅
– What’s your take on this 🤔#INDvPAK pic.twitter.com/rP6tIoP0Yi
— Richard Kettleborough (@RichKettle07) September 21, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి