AP, Telangana News Live: జీఎస్టీ పొదుపు పండుగ.. ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలిః మోదీ – Telugu News | Andhra Pradesh, Telangana, Latest news Live Updates, New GST rates, Breaking,Political News Headlines 22st Sep 2025

AP, Telangana News Live: జీఎస్టీ పొదుపు పండుగ.. ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలిః మోదీ – Telugu News | Andhra Pradesh, Telangana, Latest news Live Updates, New GST rates, Breaking,Political News Headlines 22st Sep 2025


జీఎస్టీ సంస్కరణలతో కొత్త చరిత్ర మొదలవుతోందని అన్నారు ప్రధాని మోదీ. ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతున్నాయన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు. దీని వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత దోహదం చేస్తామన్నారు.పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని.. ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరింత ఊతమిస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

మరోవైపు దేశ ప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. ఏడాది కాలంలో ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితి పెంపు, జీఎస్టీ తగ్గింపు మధ్య తరగతి ప్రజలకు డబుల్‌ బొనాంజా లాంటిదన్నారు. ఐటీ మినహాయింపు, జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతుందన్నారు.

2014లో దేశసేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రజాహితం కోసం GSTని ప్రాధాన్యతగా చేసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకోసం ప్రతి వాటాదారుడితో చర్చించి వారి సందేహాలు తీర్చామని.. సమస్యలు పరిష్కరించామని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తా కథనాలు ఇక్కడ తెలుసుకోండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *