Video: కళ్లు తిరిగే వేగంతో దూసుకొచ్చిన లంబోర్గిని.. డివైడర్‌ను ఢీ కొట్టింది.. వామ్మో..

Video: కళ్లు తిరిగే వేగంతో దూసుకొచ్చిన లంబోర్గిని.. డివైడర్‌ను ఢీ కొట్టింది.. వామ్మో..


కోట్లు ఖరీదు చేసే కారు.. కళ్లు చెదిరే వేగంతో దూసుకొచ్చింది. అదే వేగంతో డివైడర్‌ను ఢీ కొట్టింది.. వామ్మో ఆ సీన్‌ చూస్తే వణుకుపుట్టడం ఖయం. అంత భయంకరమైన ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం 9:15 గంటల ప్రాంతంలో ముంబైలోని కోస్టల్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఖరీదైన కారు ప్రమాదానికి గురికావడంతో కోస్టల్ రోడ్డులో జనం గుమిగూడారు.

ఈ ప్రమాదంతో కారులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. రేమండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో.. వేగంగా వస్తున్న లంబోర్గిని కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఫుటేజ్‌లో వాహనం అధిక వేగంతో వస్తున్నట్లు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *