సోషల్ మీడియాలో ఈమధ్యకాలంలో సినీతారల చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మలయాళీ చిత్ర పరిశ్రమలో ఆమె సంచలనం. ఆ తర్వాత తమిళంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు వెండితెరపై హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. చిన్నప్పుడు కెమెరా అంటే భయపడేదట. కెమెరా ముందుకు వెళ్లగానే ఏడుస్తూనే ఉండేదట.తన చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకుంటూ బాల్యాన్ని.. చిన్నప్పటి దుస్తులను మిస్ అవుతున్నానంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఈ హీరోయిన్ మరెవరో కాదండి.. కేరళ కుట్టి పార్వతి తిరువోతు. 2006లో విడుదలైన ‘అవుట్ ఆఫ్ సిలబస్’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
2015 లో ఎన్ను నింటే మొయిదీన్ , చార్లీ చిత్రాల్లో అద్భుతమైన నటనతో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్స్ అందుకుంది. మలయాళంతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
రెండు వెబ్ సిరీస్ సైతం చేసింది. ఇటీవలే విక్రమ్ జోడిగా తంగలాన్ చిత్రంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..