క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే మైదానంలో ఆటతో పాటు, మైదానం వెలుపల జరిగే ఘటనలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా మరోసారి అలాంటి వివాదమే చోటుచేసుకుంది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మధ్య కరచాలనం లేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ తలపడిన మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. అప్పుడు కూడా టాస్ సమయంలో ఇరు దేశాల కెప్టెన్లు చేతులు కలుపుకోలేదు. ఆ తర్వాత మ్యాచ్ ముగిశాక కూడా కరచాలనం చేసుకోకుండానే భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదు కూడా చేసింది. ఇదంతా జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయమని, ఇది అమరవీరులకు, బాధితులకు తమ సంఘీభావమని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
అయితే, తాజాగా ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలుపుకోలేదు. సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత పాక్ కెప్టెన్‌తో కరచాలనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది.
📸:💚🇵🇰
🚨NEW TRADITION-No handshake between SKY and SALMAN ALI AGHA 😂
-Looks like ANDY PYCROFT is India’s 12th man today!
-91 TIMES UMPIRING 😳#INDvPAK | #AsiaCup2025 pic.twitter.com/yqWqimWTpc
— 𝐅𝐚𝐧❥𝐁𝐚𝐛𝐚𝐫 𝐀𝐳𝐚𝐦 𝐁𝐥𝐢𝐬𝐬🏏 (@Bobi_1A) September 21, 2025
ఈ పరిణామాలపై అభిమానులు, మాజీ క్రీడాకారులు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, దేశభక్తిని చాటిచెప్పారని ప్రశంసిస్తుండగా, మరోవైపు ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని కొందరు విమర్శిస్తున్నారు. పీసీబీ కూడా ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
మొత్తంగా, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదని, దాని వెనుక ఉన్న రాజకీయ, సామాజిక అంశాలు కూడా ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ ‘నో-హ్యాండ్‌షేక్’ వ్యవహారంపై రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..