సాధారణంగా ప్రేమ పెళ్లిళ్లు జరిగిన సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిపై, అతని కుటుంబ సభ్యులపై కేసు పెడుతుంటారు. వందలో 99 శాతం కేసులు ఇలానే ఉంటాయి. కానీ, విచిత్రంగా ఓ ప్రేమ పెళ్లి విషయంలో అబ్బాయి కుటుంబ సభ్యులు అమ్మాయిపై కేసు పెట్టారు. అది కూడా బాల్య వివాహ కేసు. వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇది నిజంగా జరిగిన ఘటన.
ఈ సంఘటన మాగడి తాలూకా కుదూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సౌమ్య (19), వసంత్(19) అనే యువతీ యువకులు ప్రేమించుకున్నారు. సౌమ్య తరఫు పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా జూలై 11న ఇద్దరూ మాగడిలోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. అయితే వసంత్ కుటుంబ సభ్యులు సౌమ్యపై పోలీస్ స్టేషన్లో బాల్య వివాహం కేసు పెట్టారు. ఎందుకంటే.. చట్ట ప్రకారం వధువుకి 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్లు నిండాలి. అయితే ఇక్కడ పెళ్లికొడుకు వయసు 19 ఏళ్లే కావడంతో అతని కుటుంబీకులు సౌమ్యపై కుదూరు పోలీస్స్టేషన్లో బాల్య వివాహం చట్టం కింద ఫిర్యాదుచేయగా కేసు నమోదయింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి