
- సెప్టెంబరు 22 నుంచి GST ఉత్సవ్ ప్రారంభం కాబోతోందన్నారు ప్రధాని మోదీ. కొత్త చరిత్ర మొదలవుతోందన్నారు. తదుపరి తరం GST సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయన్నారు.
- GST సంస్కరణలు విప్లవాత్మకం అన్నారు ప్రధాని మోదీ. సెప్టెంబర్ 22 నుంచి GSTలో మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించారు.
- GST తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు ప్రధాని. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
- GST సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయన్నారు ప్రధాని మోదీ. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇది దోహదం చేస్తాయన్నారు.
- గతంలో అనేక పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు ప్రధాని. 2017లో తీసుకొచ్చిన GST ద్వారా కొత్త అధ్యాయం మొదలైందన్నారు. దేశంలోని అన్ని వర్గాలతోనూ చర్చించి ఈ సంస్కరణలు తెచ్చామన్నారు.
- సోమవారం నుంచి కేవలం రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయన్నారు మోదీ. తాజా మార్పులతో వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. పెట్టుబడుల ప్రవాహం, ప్రజల పొదుపు పెరుగుతుందన్నారు.
- బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తువులు పంపాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేదన్నారు ప్రధాని. వన్ నేషన్-వన్ ట్యాక్స్‌తో ఈ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. రవాణా చౌకగా మారిందన్నారు.
- దేశంలోకి చాలా విదేశీ వస్తువులు వచ్చాయన్నారు మోదీ. ప్రజలు మేడిన్ ఇండియా ఉత్పత్తులే వాడాలని పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువులు కొంటామని గర్వంగా చెప్పుకోవాలన్నారు.
- రాష్ట్రాలు ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించాలని, అప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యమవుతుందన్నారు ప్రధాని మోదీ. మనం ఉత్పత్తిచేసే వస్తువులు దేశ గౌరవాన్ని పెంచుతాయన్నారు. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలన్నారు.