తెలుగు రాష్టాల్లో ఓజి ఫీవర్ మొదలైపోయింది.. వీరమల్లు అంచనాలు అందుకోకపోయినా.. పవన్‌కు కొన్నేళ్లుగా సరైన విజయం లేకపోయినా అవేవీ ఓజి సినిమాపై అస్సలు ప్రభావం చూపించట్లేదు.. పైగా పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హైప్‌తో వస్తున్న సినిమా ఓజి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లపై క్లారిటీ ఇచ్చేసింది.
తెలంగాణలో సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల ప్రీమియర్ షోకు అనుమతులు వచ్చేసాయి. హరిహర వీరమల్లుకు సైతం ముందు రోజే పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈసారి ఓజికి టికెట్ రేట్ 800 రూపాయలుగా డిసైడ్ చేసింది గవర్నమెంట్. అలాగే తొలి 10 రోజుల పాటు GSTతో కలిపి మల్టీప్లెక్స్‌లలో 150, సింగిల్ స్క్రీన్స్‌లో 100 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది.
రేట్లు పెరిగిన తర్వాత తెలంగాణలో మల్టీప్లెక్స్‌లలో 445 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్‌లో 275 రూపాయిలుగా ఉన్నాయి టికెట్ రేట్లు. ఇక ఏపీలో రెండ్రోజుల ముందే పర్మిషన్స్ వచ్చేసాయి. అక్కడ కూడా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు మల్టీప్లెక్స్‌లలో 150, సింగిల్ స్క్రీన్స్‌లో 125 రూపాయలు పెంచుకునే వెసలుబాటు కల్పించింది ప్రభుత్వం.
ఏపీలో పెరిగిన రేట్లు చూస్తే.. మల్టీప్లెక్స్‌లలో 327 రూపాయలు, 270 రూపాయలుగా ఉన్నాయి. ఏపీలో బెనిఫిట్ షో టికెట్ 1000 రూపాయలు. ఓవర్సీస్లోనూ రికార్డ్ స్థాయిలో విడుదలవుతుంది ఓజి. మొత్తానికి మరో మూడ్రోజుల్లో పవర్ స్టార్ ఫైర్ స్ట్రామ్ రాబోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.