కూతురు వయసున్న హీరోయిన్.. ఆమెతో నటించనని చెప్పిన విజయ్ సేతుపతి..

కూతురు వయసున్న హీరోయిన్.. ఆమెతో నటించనని చెప్పిన విజయ్ సేతుపతి..


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ఆయన గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. హీరోగానే కాదు విలన్ గానూ నటించి మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ సేతుపతి తమిళంలో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అలాగే విజయ్ సేతుపతి హీరోగా నటించిన పిజ్జా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు.

రాడ్ సింగిల్స్‌కు మాత్రమే..! ఏం సినిమా రా బాబు..!! భర్త మరొక అమ్మాయితో.. భార్య ఇంకొకడితో..

హీరోగానే కాదు విలన్ గాను ప్రేక్షకులను మెప్పించాడు విజయ్ సేతుపతి. తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ గా నటించాడు. అంతకన్నా ముందు తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఇక హిందీలోనూ నటించి మెప్పించారు. అక్కడ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో విలన్ గా చేశాడు. అలాగే మేరీ క్రిస్మస్ సినిమాలోనూ నటించాడు.

6 సినిమాలు చేస్తే 5 ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్.. నెట్టింట ఈ అమ్మడి రచ్చ మాములుగా ఉండదు..

ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి ఓ హీరోయిన్‌తో నటించడానికి నో చెప్పాడని మీకు తెలుసా.? అవును ఆ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ బ్యూటీ కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి కూతురిగా నటించింది కృతిశెట్టి. ఆతర్వాత తమిళ్ లో విజయ్ సేతుపతి నటించిన డీఎస్పీ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ కృతిశెట్టిని ఎంపిక చేశారట. అయితే దర్శకుడు వచ్చి విజయ్ కు కృతిశెట్టి గురించి చెప్పగానే .. ఆమెకు నా కూతురి వయసు ఉంటుంది.. ఆమెతో నటించాను అని చెప్పాడట.. ఓ సందర్భంలో విజయ్ మాట్లాడుతూ.. ఉప్పెన క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు కృతి కాస్త కంగారు పడింది. దీంతో నాకు నీ అంత వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. నువ్వు కూడా నా కూతురులాంటిదానివే. భయపడకు.. ధైర్యంగా చెయ్ అని ప్రోత్సహించాను. కాబట్టి కూతురిలా భావించిన అమ్మాయితో ఒక జోడీగా నటించడం నా వల్ల కాదు అని చెప్పారట విజయ్. కృతి నాకు కూతురిలాంటిది.. ఆమెతో ఇలాంటి రొమాంటిక్ సినిమా చేయను అని చెప్పారట విజయ్ సేతుపతి.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *