తక్షణం అమెరికాకు వచ్చేయండి.. హెచ్-1బీ వీసాదారులకు టెక్‌ కంపెనీల సూచన! – TV9

తక్షణం అమెరికాకు వచ్చేయండి.. హెచ్-1బీ వీసాదారులకు టెక్‌ కంపెనీల సూచన! – TV9


అమెరికాలో హెచ్-1బీ వీసా ఫీజులను లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమెరికాలోని టెక్ కంపెనీలను, అలాగే భారతీయ ఐటీ నిపుణులను కలవరపెట్టింది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి రానుండటంతో, అమెరికా వెలుపల ఉన్న హెచ్-1బీ మరియు హెచ్-4 వీసాదారులను వెంటనే అమెరికాకు తిరిగి రావాలని పలు టెక్ కంపెనీలు సూచించాయి. మైక్రోసాఫ్ట్,జెపీ మోర్గాన్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ విషయంలో అడ్వైజరీలు జారీ చేసినట్లు సమాచారం. అమెరికాలోనే పనిచేస్తున్న ఉద్యోగులు కొంతకాలం అక్కడే కొనసాగించాలని, ఇప్పటికే అమెరికాలో ఉన్నవారు అంతర్జాతీయ ప్రయాణాలు చేయకుండా ఉండాలని కూడా కంపెనీలు సూచించాయి. అయితే, ఈ సమాచారాన్ని మైక్రోసాఫ్ట్ లేదా జెపీ మోర్గాన్ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ కొత్త ఫీజు విధానం 12 నెలలపాటు అమలులో ఉంటుందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా అమెరికా ఖజానాకు వంద బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం లభిస్తుందని, ఆ డబ్బును అప్పును తగ్గించడానికి, పన్ను కోతలకు ఉపయోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఈ నిబంధన ప్రతిభావంతుల రాకపోకలకు ఆటంకం కలిగించి ఆవిష్కరణలను దెబ్బతీస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మీ వీధిలో బొంతలు కుట్టేవాళ్లు తిరుగుతున్నారా.. జాగ్రత్త వీడియో – TV9

ప్రభాస్ చిత్రంలో అభిషేక్ బచ్చన్? వీడియో

5 రూపాయలకే చొక్కా.. ఎగబడిన జనం..ట్విస్ట్‌ మాత్రం అదిరింది..- TV9

భలే కొట్టేశారు.. తిరిగి తెచ్చి అక్కడే పెట్టేశారు..ఎందుకంటే వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *