గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇందులో చరణ్ ఊరమాస్ అవతారంలో కనిపించనున్నాడు. అలాగే పక్కా మాస్ యాక్షన్ హీరోగా చాలా కాలానికి థియేటర్లలో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అయ్యారు చరణ్. దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాతోపాటు చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో ఇదివరకు వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. దీంతో ఇప్పుడు హీరోయిన్ ఎవరనే విషయంపై నెట్టింట చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఫిల్మ్ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చరణ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. గతంలో సుకుమార్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన నేనొక్కడినే సినిమాతో కథానాయికగా పరిచయమైంది కృతి. ఆ తర్వాత దోచేయ్, ఆదిపురుష్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ నటించిన ఈ మూడు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కు మకాం మార్చిన కృతి.. ఇప్పుడు చాలా కాలం తర్వాత రామ్ చరణ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..