ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22 అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలను సందర్శిస్తారు, అక్కడ ఆయన అనేక కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. పునరాభివృద్ధి చేసిన మాతా త్రిపుర సుందరి ఆలయాన్ని ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి ముందుగా అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శిస్తారు, అక్కడ ఇటానగర్‌లో రూ.5,100 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఒక సభలో కూడా ప్రసంగిస్తారు. ఈ ప్రాంతంలో విస్తారమైన జలవిద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ, స్థిరమైన ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ, ప్రధానమంత్రి ఇటానగర్‌లో రూ.3,700 కోట్లకు పైగా విలువైన రెండు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
ప్రభుత్వ పత్రికా ప్రకటన ప్రకారం.. హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (240 మెగావాట్లు), టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (186 మెగావాట్లు) అరుణాచల్ ప్రదేశ్‌లోని సియోమ్ సబ్-బేసిన్లో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తవాంగ్ సరిహద్దు జిల్లాలో 9,820 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కేంద్రం, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సాంస్కృతిక ఉత్సవాలు, ప్రదర్శనలను నిర్వహించడానికి ఒక ల్యాండ్‌మార్క్ సౌకర్యంగా ఉపయోగపడుతుందని, తవాంగ్‌లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
1,500 మందికి పైగా ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యంతో, ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ప్రాంతం పర్యాటక, సాంస్కృతిక సామర్థ్యానికి మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి రూ.1,290 కోట్లకు పైగా విలువైన బహుళ కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు, ఇవి కనెక్టివిటీ, ఆరోగ్యం, అగ్నిమాపక భద్రత, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు వంటి వివిధ రంగాలకు ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయని, జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని, కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి