ఫైబర్‌ సప్లిమెంట్లతో సమస్యలు తప్పవు!

ఫైబర్‌ సప్లిమెంట్లతో సమస్యలు తప్పవు!


ప్లేట్‌లో బాదం, పిస్తా, స్నాక్స్​లా తొక్కతీయని కీరా, ఆపిల్స్, క్యారెట్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్లు, శనగలు, రాజ్మా, మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలూ, అవిసె, సబ్జా, బీన్స్, బఠానీలు, అవకాడోల్లో పీచు లభిస్తుంది. ప్రతి భోజనంలో అధిక ఫైబర్ ఉండే ఆహారాలను తినాలి. దీంతో పెద్దపేగు సమస్యలు తగ్గుతాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా, కడుపు నిండుగా ఉన్నట్లు చేస్తుంది. క్యాలరీల తగ్గించడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుంది. గుండెజబ్బులు, పేగు క్యాన్సర్​లను నివారిస్తుంది. సహజ ఆహారాలకు బదులు ఫైబర్ సప్లిమెంట్లు తీసుకుంటే పొట్టలో ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి, మలబద్ధకం వస్తాయి. తీసుకున్న ఆహారంలోని కాల్షియం, ఐరన్, జింక్‌ను గ్రహించడంలో .సమస్యలొస్తాయి. ఫైబర్ మాక్సింగ్ పేరుతో కొందరు పౌడర్స్, సప్లిమెంట్లను వాడుతున్నారు. ఇవి సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల సూచనల ప్రకారమే మేం మీకు ఆరోగ్య సమాచారాన్నిఅందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్య సలహాలు తీసుకోండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుడిపెలున్న చేపను చూసారా

ట్యాంక్‌లో ఇరుక్కున్న ఏనుగు.. ఎలా కాపాడారో చూడండి

ఎలుగుబంటికి కూల్‌ డ్రింక్‌ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏమైందంటే

బెడ్‌పై పడుకుందామని దుప్పటి తీసిన వ్యక్తి… దెబ్బకు పరుగో పరుగు

ఇళ్లకు తలుపులే లేని గ్రామం.. మరి దొంగలు పడితే..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *