Tollywood: నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌.. ఈ నలుగురితో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

Tollywood: నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌.. ఈ నలుగురితో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?


సినిమా ఇండస్ట్రీలో హీరోలకు వయసుతో సంబంధముండదు. కానీ హీరోయిన్లకు మాత్రం కచ్చితంగా ఏజ్ తో సంబంధముంటుంది. అందుకే హీరోలతో పోల్చుకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా ఒకటి రెండు ఫ్లాపులు పడితే చాలా చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతుంటారు. ఇక పెళ్లి చేసుకున్నాక కూడా కథానాయికలకు అవకాశాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్లను వేళ్లమీదే లెక్క పెట్టవచ్చు. అలాంటి వారిలో ఈ స్టార్ నటి కూడా ఒకటి. 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార 40 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. 1983 హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సుమారు 250 కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ కథానాయికగా ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్ బాబు, రజనీకాంత్.. ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీని ఏలిందీ అందాల తార. ఇక పెళ్లి, పిల్లల తర్వాత సహాయక నటిగా పవర్ ఫుల్ రోల్స్ లో మెరుస్తోంది. అంతేకాదు ‘అక్కినేని’ హీరోలందరితోనూ నటించిన ఏకైక హీరోయిన్ గా నూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మొదలు నేటి నాగ చైతన్య, అఖిల్‌ వరకు.. మూడు తరాలతో కలిసి నటించిన ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు రమ్యకృష్ణ.

అక్కినేని నాగేశ్వరరావుతో ‘దాగుడు మూతలు దాంపత్యం, ఇద్దరే ఇద్దరు, సూత్రధారులు సినిమాల్లో కలిసి నటించింది రమ్యకృష్ణ. ఇక నాగార్జున ఆమెది హిట్ పెయిర్. హలో బ్రదర్‌, సంకీర్తన, చంద్రలేఖ, అన్నమయ్య, అల్లరి అల్లుడు లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ వీరి కాంబోలో తెరకెక్కాయి.

ఇవి కూడా చదవండి

రమ్యకృష్ణ లేటెస్ట్ ఫొటోస్..

ఇక అక్కినేని మూడో తరం హీరోలైన నాగ చైతన్యతోనూ రమ్యకృష్ణ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. శైలజా రెడ్డి సినిమాలో చైతుకి అత్తగా నటించిన ఈ అందాల తార బంగార్రాజు సినిమాలో నానమ్మగా యాక్ట్ చేసింది. ఇక నాగ్‌ చిన్న కొడుకు అఖిల్‌ ‘హలో’ మూవీలోనూ రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించింది. ఇలా అక్కినేని మూడు తరాలతో నటించిన ఏకైన హీరోయిన్‌గా రమ్యకృష్ణ నిలిచింది. స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ నలుగురితో కలిసి ‘మనం’ సినిమాలో యాక్ట్ చేసింది. అయితే విడివిడిగా నటించిన ఏకైక నటి మాత్రం రమ్యకృష్ణ అనే చెప్పుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *