నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ కెరీర్ ఏమంత గొప్పగా లేదిప్పుడు.. కొన్నేళ్లుగా సరైన హిట్ అయితే రాలేదు రౌడీకి. కానీ క్రేజ్ విషయంలో మాత్రం విజయ్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటారు.
అదేంటో గానీ అగ్ర నిర్మాతలు ఈ హీరోతో సినిమా చేయడానికి క్యూ కడుతుంటారు. ఇప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు బ్యానర్స్‌లో సినిమాలు చేస్తున్నారు.
టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు విజయ్. 18వ శతాబ్ధంలో జరిగే యోధుడి కథ ఇది. దీనికోసం బాగా మేకోవర్ అయ్యారు విజయ్.
దీని తర్వాత దిల్ రాజు బ్యానర్లో రౌడీ జనార్ధన చేయబోతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాపైనా.. విజయ్ను నమ్మి మరో సినిమా చేస్తున్నారు రాజు. లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్‌కు వచ్చిన విజయ్ దేవరకొండకు గీతా ఆర్ట్స్ నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చింది.
గీతా గోవిందంను మించిపోయే సినిమా త్వరలోనే చేద్దాం.. చేస్తాం కూడా అంటూ మాటిచ్చారు బన్నీ వాస్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా దూసుకుపోతున్నారు రౌడీ బాయ్.