పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు తెలుగు, హిందీ సినిమాల్లో నటించింది. ముఖ్యంగ తెలుగులో మాస్ మహారాజా రవితేజతో కలిసి ఒక సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
. అలాగే పలు సినిమాల్లోనూ సహాయక నటిగానూ యాక్ట్ చేసింది. తను మరెవరో కాదు నేనింతే సినిమా హీరోయిన్ శియా గౌతమ్ అలియాస్ అదితీ గౌతమ్. తాజాగా ఆమె కాశీ లో తళుక్కుమంది.
ఈ మధ్యన పెద్దగా సినిమాల్లో కనిపించని అదితీ గౌతమ్ తాజాగా వారణాసి వెళ్లింది. అక్కడి కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు చేసింది. అలాగే కాశీ వీధుల్లో తిరుగుతూ సందడి చేసింది.
తన కాశీ యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అదితీ గౌతమ్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
నేనింతే తర్వాత వేదం, డబుల్ డెక్కర్ (కన్నడ), సంజు (హిందీ), పక్కా కమర్షియల్ తదితర సినిమాల్లో నటించింది అదితీ గౌతమ్. అలాగే వేణు తొట్టెంపూడి నటించిన అతిథి అనే వెబ్ సిరీస్ లోనూ ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసింది
సినిమాల సంగతి పక్కన పెడితే 2023లో నికిల్ పాల్కేవాలా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అదితీ గౌతమ్. ప్రియమణి తదితర సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు.