రాత్రి నిద్రకు ముందు.. నాభిపై కాసిన్ని నూనె చుక్కలు వేశారంటే!

రాత్రి నిద్రకు ముందు.. నాభిపై కాసిన్ని నూనె చుక్కలు వేశారంటే!


నాభికి నూనె రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరంలోని ప్రతి భాగాన్ని చురుగ్గా మారుస్తుంది. నాభికి నూనె రాయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నాభికి నూనె రాయడాన్ని ‘నాభి చిత్త’ అంటారు. ఆయుర్వేధం ప్రకారం.. అనేక నరాలు నాభికి అనుసంధానించబడి ఉంటాయి. అందువల్ల నూనె రాసి మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అయితే నాభికి ఏ నూనె ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఏ నూనె మంచిది?

ప్రఖ్యాత యోగా గురువు, రచయిత్రి హంస యోగేంద్ర తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ అంశంపై ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో నాభికి వేర్వేరు నూనెలు రాయడం వల్ల వేర్వేరు ప్రయోజనాలు లభిస్తాయని ఆమె వివరించారు.

బాదం నూనె

మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, తరచుగా మేల్కొంటూ తగినంత నిద్రలేకపోతే మీ నాభికి బాదం నూనె రాయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పడుకునే ముందు, నాభికి 2-3 చుక్కల వెచ్చని బాదం నూనె వేసి, చేతులతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, గాఢ నిద్రను అందించడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆవ నూనె

భోజనం తర్వాత ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే ఆవ నూనెను నాభికి పూయడం ప్రభావవంతంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో నివసించే ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

వేప నూనె లేదా కొబ్బరి నూనె

ముఖం మీద మొటిమలు ఉంటే నాభికి వేప నూనె లేదా కొబ్బరి నూనె రాయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండు నూనెలు శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. ఇది మీ ముఖం, వీపుపై మొటిమలను క్రమంగా తగ్గిస్తుంది.

ఆముదం

ఆముదం నూనె శరీరానికి కూడా మంచిది. దీన్ని నాభికి పూయడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, పీరియడ్స్‌ కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నూనె మంటను తగ్గిస్తుంది. ఇది శరీరం లోపల నొప్పిని తగ్గిస్తుంది.

ఆవు నెయ్యి

స్త్రీలలో పీరియడ్స్‌ సమయంలో మానసిక స్థితిలో మార్పులు వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. ఇలాంటి సమయంలో ఆవు నెయ్యిని నాభికి పూయడం ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యి శరీరాన్ని చల్లబరుస్తుంది. మానసిక సమతుల్యతను మెరుగుపరుస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *