iPhone 17: ఐఫోన్ 17లో ప్రాబ్లెమ్.. తప్పు ఒప్పుకున్న యాపిల్! ఇంతకీ ఏం జరిగిందంటే..

iPhone 17: ఐఫోన్ 17లో ప్రాబ్లెమ్.. తప్పు ఒప్పుకున్న యాపిల్! ఇంతకీ ఏం జరిగిందంటే..


iPhone 17: ఐఫోన్ 17లో ప్రాబ్లెమ్.. తప్పు ఒప్పుకున్న యాపిల్! ఇంతకీ ఏం జరిగిందంటే..

ఐఫోన్ 17 మొబైల్ తో ఫొటోలు తీస్తున్న ఓ టెక్ జర్నలిస్ట్ కెమెరాలో ఒక బగ్ ఉన్నట్టు గమనించాడు. యాపిల్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన  ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ లో  ఫోటోలు తీస్తున్నప్పుడు ప్రతి పది ఫోటోలలో ఒకటి తేడాగా వస్తుందని. లైటింగ్ ఎక్కువ ఉన్నచోట బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయని గమనించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఫోటోస్ లో బ్లాక్ స్పాట్స్ తో పాటు కొన్ని సార్లు చిన్న చిన్న పిక్సెల్ బాక్స్ లు, తెల్లటి గీతలు కనిపించాయని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీనికి యాపిల్ స్పందించి కెమెరా సిస్టమ్ లో బగ్ ఉన్నట్టు ఒప్పుకుంది. అది మొబైల్ సెన్సర్..  లైటింగ్ ను ప్రాసెస్ చేసే సమయంలో ఏర్పడిన సాఫ్ట్‌వేర్ బగ్ అని పేర్కొంది.

యాపిల్ తాజాగా లాంఛ్ చేసిన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లలో ఎక్కువ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ ఉందని చెప్పంది. అంటే కెమెరా పెర్ఫామెన్స్ అనేది ఇమేజ్ సెన్సర్ కంటే  ఎక్కువగా సాఫ్ట్ వేర్ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ తరహా బగ్స్ బయటపడుతున్నాయి. అయితే.. ఇవి సాఫ్ట్ వేర్ బగ్గ్ కాబట్టి వీటిని పరిష్కరించడం కూడా తేలికే.. ఇప్పటికే యాపిల్ .. ఈ సమస్యను తదుపరి సాఫ్ట్ వేర్ అప్ డేట్ లో సరిచేస్తామని పేర్కొంది.

యాపిల్ నుంచి లేటెస్ట్ గా లాంఛ్ అయిన ఐఫోన్ 17 సిరీస్‌ పై మిక్స్ డ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సిరీస్ లో వచ్చిన ఐఫోన్ ఎయిర్‌ అనే మొబైల్ చాలా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇప్పటి వరకు ఆపిల్ విడుదల చేసిన అన్ని మొబైల్స్‌లో అత్యంత సన్నని మొబైల్. ఈ ఫోన్ 5.6 మి.మీ. మందం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ  ఈ ఫోన్ లో 6.5-అంగుళాల స్క్రీన్‌, 48 ఎంపీ రియర్ కెమెరా,18ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అయితే బయటపడుతున్న సాఫ్ట్ వేర్ బగ్స్ వల్ల యూజర్లు డిజప్పాయింట్ అవుతున్నట్టు తెలుస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *